Cine Drugs Case : డ్రగ్స్ కేసులో కూపీ లాగుతున్న పోలీసులు.. ఈ ఒక్కటీ జరిగితే సినీ తారలు బాగోతం బట్టబయలే..!

ABN , First Publish Date - 2023-06-16T12:10:55+05:30 IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీ డ్రగ్స్ కేసును (Cine Drugs Case) సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ కేసులో (Drugs Case) అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరి (KP Chowdary) కస్టడీ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు..

Cine Drugs Case : డ్రగ్స్ కేసులో కూపీ లాగుతున్న పోలీసులు.. ఈ ఒక్కటీ జరిగితే సినీ తారలు బాగోతం బట్టబయలే..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీ డ్రగ్స్ కేసును (Cine Drugs Case) సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ కేసులో (Drugs Case) అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరి (KP Chowdary) కస్టడీ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. కేపీని వారం రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. కేపీ లిస్టులో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు భారీగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చౌదరి ఫోన్‌లో వందల కొద్దీ కాంటాక్ట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సినీ పరిచయాలు కారణంగా ప్రముఖుల నంబర్లు భారీగా ఉన్నాయి.

కేపీని కస్టడీకి ఇస్తే డ్రగ్స్ లింక్స్ ఉన్న సినీ తారలెవరో తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. నిర్మాత ఇచ్చే సమాచ్చారంతో సినీ తారల డ్రగ్స్ బాగోతాలు బట్టబయలు కానున్నాయి. కాగా ఈ డ్రగ్స్ కేసులో ఏ-1గా ఉన్న రాకేష్ రోషన్‌కు సైతం స్టార్స్‌తో సంబంధాలు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో జరిగిన పలు పార్టీలకు రాకేష్, కేపీ ఇద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. గాబ్రియేల్ నుంచే పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోకి డ్రగ్స్ ప్రవేశించినట్లుగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే హైదరాబాద్‌లో గాబ్రియేల్‌పై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఏం జరుగుతుందో..?

టాలీవుడ్‌లో ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులో పలువురు హీరోలు, దర్శకులను ప్రశ్నించడం పెద్ద సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులను ప్రత్యేక విచారణ బృందం విచారణ చేసింది. వీరిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్, ముమైత్ ఖాన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. అయితే.. తాజాగా కేపీ చౌదరి అరెస్ట్‌తో మరోసారి ఆ పేర్లన్నీ తెరపైకి వస్తున్నాయి. అయితే నిర్మాత కాంటాక్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి..? ఒకవేళ ఆ పేర్లన్నీ బయటికొస్తే పరిస్థితేంటి..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే..ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరెవరికి లింకులు ఉన్నాయి..? టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ కేపీకి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరాతీస్తున్నట్లుగా తెలుస్తోంది.

Updated Date - 2023-06-16T12:10:55+05:30 IST