Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇదే హాట్ టాపిక్..

ABN , First Publish Date - 2023-06-11T10:22:55+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య (Apsara Muder Case) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇదే హాట్ టాపిక్..

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య (Apsara Muder Case) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక అంశాలు, ప్రాథమిక దర్యాప్తు, రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. తాజాగా ఈ హత్యకేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరకు గతంలోనే పెళ్లయ్యిందనే (Apsara Marriage) విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. మొదటి పెళ్లికి సంబంధించి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. దీంతో అప్సర హత్యకేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.! ఈ కేసును వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. ఇలా ఫోటోలు నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఈ కేసు మరింత క్రిటికల్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఇప్పుడీ కొత్త కోణంలో కూడా విచారించాల్సి ఉంది. ఇదిలావుంటే.. నిందితుడు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. నెట్టింట్లో అప్సర పెళ్లి ఫొటోలు చూసిన నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ సాయికృష్ణను దుమ్మెత్తి పోసిన నెటిజన్లు.. ఇప్పుడు అప్సరను తిట్టిపోస్తున్నారు. ఇంకొందరేమో బాబోయ్ ఈ కేసులో ‘ఇన్ని ట్విస్ట్‌లా.. అప్పుడే అయిపోయిలేదేమో ఇంకా చాలానే ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Apsara-Marriage-First.jpg

ఇంతకీ ఆయన ఏమయ్యారు..!?

అప్సర పెళ్లయ్యిందన్న విషయం ఫొటోలను చూస్తే అర్థమవుతోంది సరే.. ఆయన ఏమయ్యారు..? ఆయన‌తో అప్సర విడాకులు తీసుకున్నారా..? లేకుంటే కలిసే ఉంటూ ఇలా చేశారా..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగానే మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అప్సరకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పోలీసులు దీనిపై ఇంకా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అతడితో విబేధాల కారణంగా ఏడాది కింద సరూర్‌నగర్‌‌లోని పుట్టింటికి వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంటి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరికీ ఒకే కమ్యూనిటీ కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే అప్సరను ఎలాగైనా సరే అంతమొందించాలని గతంలో నాలుగుసార్లు ప్రయత్నించిన సాయి.. జూన్-03న పక్కా ప్లాన్‌తో ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి హత్య చేశాడు.

WhatsApp Image 2023-06-11 at 9.53.48 AM.jpeg

పోలీసులు ఏం చెబుతున్నారంటే..

కాగా.. సీరియల్‌లో (Serials) నటించాలని చెన్నై నుంచి అప్సర 2022లో హైదరాబాద్ (Hyderabad) వచ్చి ఇక్కడే స్థిరపడిందని పోలీసులు చెబుతున్నారు.‘ అప్సర తన సోదరి వద్ద ఉంటూ ప్రయత్నాలు చేస్తుండేది. డిగ్రీ పూర్తి చేసిన అప్సర కొద్దిరోజులు సినీ రంగంలో పనిచేసింది. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. సాయికృష్ణది కోనసీమ జిల్లా గన్నవరం. మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన సాయి.. 2010లో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా ఉంటూనే.. బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరికీ ఎలాంటి బంధుత్వం లేదు. ఒక్కటే కమ్యూనిటీ మాత్రమే. అప్సర బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అలా అప్సరతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. అయితే.. సాయికి పెళ్లయినట్లు అప్సరకు ఈ మధ్యే తెలిసింది. దీంతో.. పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై అప్సర ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. హత్యను మిస్సింగ్ కేసుగా చిత్రీకరించాలని సాయి ప్లాన్ చేశాడు. సాయి కృష్ణ పరువు ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో హత్య చేశాడు. అప్సర గతంలో గర్భం దాల్చింది. అప్సరకు అబార్షన్ కూడా అయిందని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ విషయంలోనే మరింత లోతుగా విచారణ జరుపుతున్నాం. నిందితుడుని పోలీస్‌ కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ చేస్తున్నాం. అప్సర కోయంబత్తూరు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి సాయికృష్ణతో వెళ్లింది. సాయికృష్ణ ఆమెను శంషాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తిప్పి సుల్తాన్‌పుర్‌ తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తు తేలింది’ అని డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.

DCP--Narayana-Reddy.jpg

మొత్తానికి చూస్తే.. ఈ ఫొటోలతో పోలీసులు మరోసారి కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయి ప్లాన్ వెనుక భర్త కూడా ఉన్నాడా..? లేకుంటే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని సాయి ఒక్కడే అప్సరను హత్య చేశాడా..? అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉంది. రెండ్రోజుల వ్యవధిలోనే ఇన్ని ట్విస్ట్‌లు బయటికి వచ్చాయంటే మున్ముందు ఇంకెన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో ఏంటో మరి..!

Apsara-And-Sai-Final.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

******************************

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

******************************

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

******************************

Apsara Murder Case : ఢిల్లీ నుంచి గల్లీ దాక సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులందరికీ సహకారం అందించింది ‘ఒక్కరే’..!

******************************


Updated Date - 2023-06-11T10:24:10+05:30 IST