Apsara Murder Case : షాకింగ్.. అప్సరకు ముందే పెళ్లయ్యిందా.. మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా..? ఫుల్ క్లారిటీ రావాలంటే..!

ABN , First Publish Date - 2023-06-11T12:43:27+05:30 IST

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో (Apsara Murder Case) గంటకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఊహించని విషయాలు, ట్విస్ట్‌లు బయటపెట్టగా.. ఇప్పుడంతా అప్సర మొదటి పెళ్లి (Apsara Marriage) గురించే చర్చ నడుస్తోంది...

Apsara Murder Case : షాకింగ్.. అప్సరకు ముందే పెళ్లయ్యిందా.. మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా..? ఫుల్ క్లారిటీ రావాలంటే..!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో (Apsara Murder Case) గంటకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఊహించని విషయాలు, ట్విస్ట్‌లు బయటపెట్టగా.. ఇప్పుడంతా అప్సర మొదటి పెళ్లి (Apsara Marriage) గురించే చర్చ నడుస్తోంది. సాయికృష్ణతో పరిచయానికి ముందే అప్సరకు పెళ్లయిందా..? ఈ విషయాన్ని అప్సర పేరెంట్స్ గోప్యంగా ఉంచారా.. ? అంటే.. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫొటోలను బట్టి చూస్తే ఇది నిజమనిపిస్తోంది. కొన్ని గంటలుగా అటు సోషల్ మీడియాలో (Social Media).. ఇటు మీడియాలో (Media) ఎక్కడ చూసినా అప్సర పెళ్లి గురించే చర్చ నడుస్తున్నది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంతవరకూ అప్సర తల్లిదండ్రుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అప్సర పెళ్లి నిజమేనని జనాలు అనుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Apsara-Marriage-First.jpg

అసలేం జరిగింది..!?

అప్సర హత్య కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా కొన్ని కీలక విషయాలు, ఫొటోలు బయటపడ్డాయి. అప్సరకు ఇదివరకే పెళ్లి అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫొటోలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందుబాటులోకి వచ్చిన ఈ ఫోటోలు చాలా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అప్సర గతంలో తమిళ టీవీ సీరియళ్ళలో (TV Serials) నటించింది కాబట్టి.. అందులో భాగంగానే పెళ్లి సన్నివేశాల్లో నటించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఫోటోలపై అప్సర తల్లిదండ్రులు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. నిందితుడు సాయిక్రిష్ణకు ఈ విషయంలో ఏదైనా సమాచారం ఉందా..? లేదా..? అనే విషయం పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తే కానీ తెలిసే అవకాశం లేదు!. అయితే.. ఈ కోణంలోనూ అప్సర పేరెంట్స్, సాయికృష్ణను పోలీసులు విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Apsara-And-Sai-Final.jpg

క్లారిటీ రావాలంటే..?

అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మొదటి భర్తతో విభేదాల అనంతరం అప్సర తల్లిదండ్రుల వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అప్సరతో పెళ్లయిన కొద్దిరోజులకే భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది. ఇలా జరిగిన తర్వాతే చెన్నై నుంచి అప్సర హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. జాతకం కోసం మొదట బంగారు మైసమ్మ గుడికి వెళ్లగా అక్కడ సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. వివిధ రకాల పూజలతో అప్సరకు సాయి దగ్గరయ్యాడు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని ఇదివరకే పోలీసులు తేల్చారు. తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకుంటే సరే లేకుంటే ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెడతానంటూ అప్సర బెదిరింపులకు కూడా పాల్పడింది. విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన సాయి.. ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. నాలుగుసార్లు ప్లాన్ చేసినప్పటికీ వర్కవుట్ అవ్వకపోగా ఐదోసారి జూన్-03న కోయంబత్తూరు (Coimbatore) వెళ్తున్నట్లు నటించి హైదరాబాద్ (Hyderabad) బయటికి తీసుకెళ్లి అప్సరను హత్య చేశాడు సాయి. మొత్తానికి చూస్తే.. అటు అప్సర తల్లిదండ్రులు గానీ.. ఇటు సాయికృష్ణని రిమాండ్ తీసుకుని విచారిస్తే గానీ క్లారిటీ వచ్చే అవకాశాల్లేవు.

WhatsApp Image 2023-06-11 at 9.53.48 AM.jpeg

పెళ్లి అయ్యింది నిజమే అయితే..?

అప్సర పెళ్లయ్యిందన్న విషయం ఫొటోలను చూస్తే అర్థమవుతోంది సరే.. ఆయన ఏమయ్యారు..? ఆయన‌తో అప్సర విడాకులు తీసుకున్నారా..? లేకుంటే కలిసే ఉంటూ ఇలా చేశారా..? పెళ్లయిన కొన్నిరోజులకే నిజంగానే భర్త ఆత్మహత్య చేసుకున్నారా..? అనేవి ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలాయి. పోలీసులు దీనిపై ఇంకా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అతడితో విబేధాల కారణంగా ఏడాది కింద సరూర్‌నగర్‌‌లోని పుట్టింటికి వచ్చిందని తెలుస్తోంది. మరోవైపు సీరియల్స్, సినిమాల్లో అప్సర నటిస్తుండేది.. ఆ క్రమంలోనే పెళ్లి సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలే అని కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇన్ని కొత్త కోణాలు, ఇన్ని ట్విస్ట్‌లు వెలుగులోకి రాగా మున్ముందు ఇంకెన్ని బయటపడతాయో వేచి చూడాల్సిందే.

Apsara-Photos.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇదే హాట్ టాపిక్..
******************************Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

******************************

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

******************************

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

******************************

Apsara Murder Case : ఢిల్లీ నుంచి గల్లీ దాక సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులందరికీ సహకారం అందించింది ‘ఒక్కరే’..!

******************************

Updated Date - 2023-06-11T12:56:17+05:30 IST