Share News

movie actress: బిగ్‌బాస్‌ తెచ్చిన తంటా... సినీనటి వనితపై దాడి

ABN , First Publish Date - 2023-11-28T08:57:26+05:30 IST

ప్రముఖ సినీనటుడు విజయకుమార్‌ కుమార్తె, సినీనటి వనిత(Movie actress Vanita)పై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి జరిపి పారిపోయాడు.

movie actress: బిగ్‌బాస్‌ తెచ్చిన తంటా... సినీనటి వనితపై దాడి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు విజయకుమార్‌ కుమార్తె, సినీనటి వనిత(Movie actress Vanita)పై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి జరిపి పారిపోయాడు. ఈ విషయాన్ని గాయపడిన వనిత తన ఎక్స్‌ పేజీలో ఫొటోతో వెలువరించారు. ఈ దాడి గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రముఖ తమిళ టీవీ చానెల్‌లో బిగ్‌బాస్‌(Bigg Boss) ఏడో సీజన్‌లో వనిత కుమార్తె జోవికా పాల్గొంటోంది. ఈ బిగ్‌బాస్‌ కార్యక్రమం గురించి వనిత రోజూ యూట్యూబ్‌లో సమీక్షిస్తోంది. ఆ మేరకు శనివారం రాత్రి యూట్యూబ్‌ చానెల్‌లో బిగ్‌బాస్‏పై రివ్యూని ముగించుకుని కారులో ఆమె చెల్లెలు సౌమ్య ఇంటి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో కారును పార్కింగ్‌ చేసి నడచి వెళుతున్న వనితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి జరిపాడు. ఈ దాడిలో ఆమె ముఖం ఎడమవైపు తీవ్రగాయమై వాచిపోయింది. బిగ్‌బాస్‎లో ప్రదీప్‌ అనే పోటీదారుడిని రెడ్‌కార్డ్‌ జారీ చేసి గెంటివేస్తారా అంటూ ఆ దుండగుడు బిగ్గరగా కేకలు పెట్టి వనితపై దాడి జరిపి పారిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న చెల్లెలు సౌమ్య మాటను వనిత పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె తెలిపారు. ఈ వివరాలను ఆమె ఎక్స్‌ పేజీలో వెలువరించి ప్రస్తుతం ఏ షూటింగ్‌లో పాల్గొనేంత పరిస్థితి లేకపోవడం వల్ల ఇంటిపట్టున విశ్రాంతి తీసుకోనున్నట్లు వనిత ప్రకటించింది. వనితపై జరిగిన దాడిపై సినీ రంగ ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు.

nani6.2.jpg

Updated Date - 2023-11-28T08:57:27+05:30 IST