Home » Chennai News
విరుదునగర్‌లో పాఠశాల విద్యార్థులు జాతీయ పతాకం రంగుల్లో బొటన వేలిముద్రతో స్వామి వివేకానంద చిత్రపటం రూపొందించి రికార్డు సాధించారు. స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతి (జూన్ 12వ తేది) యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
నగరంలోని సముద్ర తీరప్రాంతాలకు ఒక్కొక్కటిగా 37 తాబేళ్ల కళేబరాలు కొట్టుకురావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెమ్మేలి కుప్పం(Nemmeli kuppam) తీర ప్రాంతంలో సుమారు కి.మీ వరకు 20 తాబేళ్లు మృతిచెంది తీరానికి కొట్టుకొచ్చాయి.
మదురైలో 15 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన బీజేపీ రాష్ట్ర నేత ఎంఎస్. షా(BJP state leader M.S. Shah)ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
‘జయం’ చిత్రంతో ‘జయ రవి’ ప్రసిద్ధి చెందిన రవి తన అభిమానులు, సినీ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సహాలతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న ఈ మంచి తరుణంలో తనను జయం రవి పేరుతో కాకుండా, రవి లేదా రవి మోహన్(Ravi Mohan) పేరుతో పిలవాలని కోరారు.
భారతదేశంపై, భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు నమ్మకంలేదని, ఆయనకు అహంకారం ఎక్కువని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) చేసిన ఆరోపణలపై సీనియర్ మంత్రి దురైమురుగన్(Senior Minister Duraimurugan), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మండిపడ్డారు.
ప్రజలను నమ్మించి మోసం చేయడమే పాలకుల ప్రధాన లక్ష్యంగా కనబడుతోందని, అందుకు నీట్ రద్దు హామీ ప్రకటన చక్కటి ఉదాహరణ అని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్(Actor Vijay) డీఎంకే ప్రభుత్వంపై తన ఎక్స్ పేజీలో ధ్వజమెత్తారు.
ద్రావిడ తరహా డీఎంకే పాలనలో మహిళా సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల వల్ల లబ్ధిపొందుతున్న మహిళలంతా తనను ‘నాన్నా..! నాన్నా’ అని పిలుస్తుండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఆ పిలుపొక్కటే సుపరిపాలనకు నిదర్శనమని సీఎం స్టాలిన్ అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), అందరికి మూడు నెలల ‘రీచార్జ్’ చేస్తున్నారంటూ సామాజిక మాద్యమాల్లో వస్తున్న మెసేజ్‌లు నమ్మరాదని సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశాల మేరకు రాష్ట్ర ఆలయాల తరపున అయ్యప్ప భక్తులకు బిస్కెట్ ప్యాకెట్ల(Biscuit packets)ను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రెండో దశగా మరో 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్ల లోడు వాహనానికి దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) జెండా ఊపి ప్రారంభించారు.
మదురై సమీపం తిరుప్పోరూరు కందసామి ఆలయం హుండీలో జారిపడ్డ ఐఫోన్(iPhone)ను దాని సొంత దారుడు రూ.10వేలకు వేలంపాడి దక్కించుకున్నాడు.