Hero Vijay: పాదయాత్రకు ‘విజయ్’ నిర్ణయం? 100 నియోజకవర్గాల్లో సన్నాహాలు
ABN , Publish Date - Jul 23 , 2024 | 01:22 PM
స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్( Vijay) రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా ఆయన తొలుత వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్టు సమాచారం.
- ఏడాది పాటు రాష్ట్ర పర్యటన
చెన్నై: స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్( Vijay) రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా ఆయన తొలుత వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్టు సమాచారం. పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు, తనతో కలిసి పాల్గొనేందుకు వీలుగా సుమారు రెండు వేల మంది క్రియాశీలక నిర్వాహకుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. 2026లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యేడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే దిశగా ఆయన ప్రణాళిక రూపొందించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ వ్యవస్థాపక తొలి మహానాడును తిరుచ్చి(Trichy) లేదా మదురైలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మహానాడు ముగిసిన వెంటనే ఆయన రాష్ట్ర పర్యటన చేపట్టాలని భావిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Deputy CM: గంగ తరహాలోనే కావేరి హారతి...
ఇందుకోసం రాష్ట్రాన్ని నాలుగు మండలాలుగా విభజించి... పార్టీ నేతలు, నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలన్న తలంపులో ఉన్నారు. కనీసం పది జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేసమయంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పాదయాత్ర సరైన మార్గంగా భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 100 సెగ్మెంట్లలో పాదయాత్ర జరిపేలా సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే, పార్టీ మహానాడు ముగిసిన వెంటనే రాష్ట్ర స్థాయి నిర్వాహకులు, జిల్లా నుంచి బూత్ స్థాయి కమిటీల వరకు నిర్వాహకులను ఎంపిక చేయాలని, అదేసమయంలో పార్టీలో క్రియాశీలక సభ్య నమోదు కార్యక్రామన్ని కూడా ప్రాంభించాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, పార్టీని మరింతగా విస్తరించేలా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News