Share News

Health Tips: దగ్గు, జలుబు అటాక్ చేశాయా..? ఈ 7 వంటింటి చిట్కాలతో బిగ్ రిలీఫ్ ఖాయం..!

ABN , First Publish Date - 2023-11-25T14:04:08+05:30 IST

ఉప్పు నీటితో పుక్కిలించడం ఆయాసానికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు మంచి నివారణగా పనిచేస్తుంది.

Health Tips: దగ్గు, జలుబు అటాక్ చేశాయా..? ఈ 7 వంటింటి చిట్కాలతో బిగ్ రిలీఫ్ ఖాయం..!
immune function.

వేసవి కాలం నుంచి చలికాలం వరకూ సీజన్ మారుతున్న కొద్దీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా అలానే ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు ముఖ్యంగా ఉంటాయి. అయితే వీటిలో వేటికీ ఇంగ్లీష్ మందులతోనే నయం అవుతుందని కాక, జలుబు, దగ్గు నివారణకు ఇంటి నివారణలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. అదేలాగో చూద్దాం.

అల్లం..

అల్లంలో శోథ నిరోధక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది దగ్గుకు మంచి నివారణగా పనిచేస్తుంది.

తేనె..

దగ్గుకు తేనె ఎఫెక్టివ్ రెమెడీ. ఇది యాంటీబాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో ఉంటుంది. ఇది పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ చక్కని ఔషదం.

విటమిన్ సి

విటమిన్ సి ఒక అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలమైన రోగనిరోధక శక్తి సీజనల్ వ్యాధులు పెరగడాన్ని తగ్గిస్తుంది. తగినంత సిట్రస్ పండ్లను తీసుకోవడం జలుబు, దగ్గుకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.

పసుపు..

శీతాకాలంలో పసుపు వేడిని పెంచుతుంది. వెచ్చగా ఉంచడంలో సహకరిస్తుంది. జలుబు, దగ్గు లక్షణాలను తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి : పొరపాటున కూడా పొద్దున్నే ఈ 10 ఆహార పదార్థాలను మాత్రం అస్సలు తినకండి.. కారణమేంటంటే..!


ఆవిరి, పుక్కిలించడం..

ఉప్పు నీటితో పుక్కిలించడం ఆయాసానికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు మంచి నివారణగా పనిచేస్తుంది. ఇది గొంతు రద్దీని, నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. ఆవిరితో శ్వాస తీసుకోవడం రద్దీ తగ్గుతుంది. శ్వాసనాళాలకు తేమ అంది దగ్గు తగ్గుతుంది.

సూప్ లు

సూప్ లు చలి తీవ్రతను తగ్గించడంలో సూప్స్ లు బాగా సపోర్ట్ గా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా పోషకాలను అందిస్తుంది.

వేడి పానీయాలు..

చలికాలం టీలు, వెచ్చగా ఉండే పానీయాలు తాగడం వల్ల రద్దీ నుండి ఉపశమనం పొందవచ్చు. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T14:04:11+05:30 IST