Philippine: ఫిలిప్పీన్స్ ఓడలో అగ్నిప్రమాదం...12 మంది మృతి

ABN , First Publish Date - 2023-03-30T12:09:32+05:30 IST

ఫిలిప్పీన్స్ దేశంలోని నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది మరణించారు....

Philippine: ఫిలిప్పీన్స్ ఓడలో అగ్నిప్రమాదం...12 మంది మృతి
Fire On Philippine Ferry

మనీలా(ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ దేశంలోని నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది మరణించారు.(Fire On Philippine Ferry) లేడీ మేరీ జాయ్ 3 నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళుతుండగా బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు నౌక పైనుంచి దూకినట్లు విపత్తు అధికారి నిక్సన్ అలోంజో తెలిపారు.ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 12 మంది మరణించారు. ఈ నౌకలో నుంచి 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు.ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, మత్స్యకారులు కలిసి 195 మంది ప్రయాణికులు,35 మంది సిబ్బందిని రక్షించారు.

ఇది కూడా చదవండి : Toll Tax: ఎల్లుండి నుంచి టోల్ ట్యాక్స్ పెంపు...వాహనచోదకులపై మరింత భారం

ఈ అగ్నిప్రమాదంలో 14మంది గాయపడ్డారు.మరో ఏడుగురు ప్రయాణికులు గల్లంతు(Several Missing) అయ్యారు. ఓడలో నుంచి 12 మృతదేహాలను వెలికితీశామని, వారిలో ముగ్గురు పిల్లలని బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు.మంటలు ఎలా చెలరేగాయి అనేది స్పష్టంగా తెలియరాలేదు.కోస్ట్ గార్డు విడుదల చేసిన ఫోటోల్లో కాలిపోతున్న నౌకపై నీటిని చల్లడం కనిపించింది.7 వేల కంటే ఎక్కువగా ఉన్న ఫిలిప్పీన్స్ ద్వీపాల్లో పడవలు రద్దీ వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి.

Updated Date - 2023-03-30T12:17:45+05:30 IST