Earthquake: మళ్లీ ఫిజీ దీవులను వణికించిన భారీ భూకంపం
ABN , First Publish Date - 2023-04-18T12:57:08+05:30 IST
దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ఫిజీ దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది....
సువా (ఫిజీ) : దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ఫిజీ దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.(Earthquake) మంగళవారం ఫిజీ దీవుల్లో (Fiji)సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని(Earthquake of magnitude 6.3 strikes) నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఫిజీ దేశ పరిధిలో 300 దీవులున్నాయి. ఫిజీ దీవులను వణికించిన భారీ భూకంపం మంగళవారం ఉదయం 10.01 గంటలకు 569 కిలోమీటర్ల లోతులో సంభవించింది.గత గురువారం ఫిజీ దీవుల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపంతో ఫిజీ దేశ దీవులు అల్లాడాయి. ప్రజలు భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనలు చెందారు.