Floods in Congo: కాంగోలో వరద విపత్తు...400 మందికి పైగా మృతి

ABN , First Publish Date - 2023-05-09T11:15:12+05:30 IST

కాంగో దేశంలో వెల్లువెత్తిన వరదల్లో 400 మందికి పైగా ప్రజలు మరణించారు....

Floods in Congo: కాంగోలో వరద విపత్తు...400 మందికి పైగా మృతి
Floods in Congo

కిన్షాసా(కాంగో): కాంగో దేశంలో వెల్లువెత్తిన వరదల్లో 400 మందికి పైగా ప్రజలు మరణించారు.(Floods in Congo) వరదలకు తోడు కొండచరియలు విరిగిపడి పలువురు మరణించారు. వరద విపత్తు కాంగో దేశాన్ని అతలాకుతలం చేసింది. కాంగో దేశంలో కురిసిన భారీవర్షాల వల్ల నదులు ఉప్పొంగి వరదనీరు గ్రామాలను ముంచెత్తింది. వరదనీటి ధాటికి పలు గ్రామాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి.కాలేహీ టెరిటరీ పరిధిలోని దక్షిణ కివు ప్రాంత బుషుషు,న్యాముకుబి గ్రామాలు వరదలకు కొట్టుకుపోయాయి. కీవు లోయలో బురదలో మృతదేహాలు కూరుకుపోయాయి. మృతుల కోసం బంధువులు బురదలో వెతుకుతున్నారు.

ఇది కూడా చదవండి : Indore: వంతెనపై నుంచి బస్సు పడి 14 మంది మృతి

వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో 3వేల కుటుంబాలు ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. 1200 ఇళ్లు పూర్తిగా వరదలకు శిథిలమయ్యాయి. తమ పంట ఉత్పత్తులను మార్కెటులో విక్రయించుకునేందుకు వెళ్లిన వారు వరదల్లో కొట్టుకుపోయి జాడ లేకుండా పోయారు. మొత్తం మీద కాంగో దేశంలో వరదల వల్ల 400 మందికి పైగా(400 people die) మరణించారని ఆ దేశ అధికారులు వివరించారు.

Updated Date - 2023-05-09T11:15:34+05:30 IST