Pharma Companies: 18 ఫార్మా కంపెనీలకు కేంద్రం షాక్

ABN , First Publish Date - 2023-03-28T22:01:26+05:30 IST

18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను కేంద్ర ఆరోగ్య శాఖ రద్దు చేసింది. అంతేకాదు వాటి ఉత్పత్తులను ఆపాలని తెలిపింది.

Pharma Companies: 18 ఫార్మా కంపెనీలకు కేంద్రం షాక్

న్యూఢిల్లీ: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను కేంద్ర ఆరోగ్య శాఖ రద్దు చేసింది. అంతేకాదు వాటి ఉత్పత్తులను ఆపాలని ఆదేశించింది. 26 ఫార్మా కంపెనీ(Pharma Companies)లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇండియా నుంచి విదేశాలకు నకిలీ మందులు సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఫార్మా కంపెనీలపై చర్యల్లో భాగంగా డీసీజీఐ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

భారత ఔషధ నియంత్రణ సంస్థ(DCGA) 76 ఫార్మా కంపెనీల్లో కేంద్ర, రాష్ఱ్ర బృందాలతో 20 రాష్ట్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్న ఔషధాలతో మరణాలు, అనారోగ్యం ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. గత నెల గుజరాత్‌లోని జిందూస్ లైఫ్ సైన్సెస్(Zydus Lifesciences) కంపెనీకి చెందిన US మార్కెట్ నుండి గౌట్ చికిత్సకు ఉపయోగించే 55,000 కంటే ఎక్కువ బాటిళ్లను రీకాల్ చేసింది. ఈ మెడిసిన్‌లో నాణ్యతాలోపం ఉన్నట్లు తెలిసింది.

గతేడాది ఉజ్జెకిస్తాన్‌(Uzbekistan)లో దగ్గు మందు వల్ల 18 మంది చిన్నారులు మృతి చెందారన్న ఆరోపణలు రావడంతో ఢిల్లీ సమీపంలో నోయిడాకు చెందిన ఓ ఫార్మా కంపెనీకి చెందిన సిబ్బందిని అరెస్ట్ చేశారు. కల్తీ మందులను తయారు చేసి విక్రయిస్తున్నారని వారిపై ఆరోపణలు వచ్చాయి. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ఔషద నియంత్రణ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారియాన్ బయోటెక్ ప్రాడక్ట్స్ శాంపిళ్లను తనిఖీ చేసి 22 ఉత్పత్తులు కల్తీ జరిగినట్లు గుర్తించారు.

అంతేకాదు చెన్నైకి చెందిన ఓ ఫార్మా కంపెనీకి చెందిన కంటి చుక్కల మందు ఉత్పత్తులను నిలిపివేశారు. ఆ ఫార్మా కంపెనీ ఉత్పత్తులు ఔషధ నిరోధక బ్యాక్టీరియాతో కలుషితం అయి వున్నాయని, ఇవి శాశ్వత అంధత్వం, చనిపోయే ప్రమాదం కూడా ఉందని యూఎస్(US) ఆరోగ్య సంస్థలు రిపోర్టుతో ఇచ్చింది.

Updated Date - 2023-03-28T22:13:08+05:30 IST