Joshimath Scare: అలీఘడ్‌లోనూ ఇళ్లకు ఆకస్మిక పగుళ్లు

ABN , First Publish Date - 2023-01-11T07:54:40+05:30 IST

జోషిమఠ్ తరహాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలోనూ పలు ఇళ్లకు ఆకస్మిక పగుళ్లు ఏర్పడ్డాయి...

Joshimath Scare: అలీఘడ్‌లోనూ ఇళ్లకు ఆకస్మిక పగుళ్లు
cracks in Aligarh homes

అలీఘడ్ (ఉత్తరప్రదేశ్): జోషిమఠ్ తరహాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలోనూ పలు ఇళ్లకు ఆకస్మిక పగుళ్లు ఏర్పడ్డాయి.(Several Homes Cracks) అలీఘడ్ లోని కన్వారిగంజ్ నివాసితులు తమ ఇళ్లకు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడినట్లు వెల్లడించారు.(Suddenly Developing Cracks) ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.గత కొన్ని రోజులుగా తమ ఇళ్లలో పగుళ్లు కనిపించాయని, దీనివల్ల తాము భయాందోళనల మధ్య జీవిస్తున్నామని అలీఘడ్(Aligarh) వాసి శశి చెప్పారు.

ఇళ్లకు ఏర్పడిన పగుళ్లపై తాము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్థానికులు చెప్పారు. స్మార్ట్ సిటీ పథకం కింద ప్రభుత్వం వేసిన పైప్‌లైన్ లో లీకేజీలే తమ ఇళ్ల పగుళ్లకు కారణమని స్థానికులు ఆరోపించారు. కన్వారిగంజ్ ప్రాంతంలో కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని తమకు సమాచారం వచ్చిందని అలీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) అదనపు కమిషనర్ రాకేష్ కుమార్ యాదవ్ చెప్పారు. పగుళ్లు ఏర్పడిన ఇళ్లను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని రాకేష్ యాదవ్ చెప్పారు.

Updated Date - 2023-01-11T08:31:22+05:30 IST