Baba Vanga: 2023లో భూమికి పెనువిపత్తు?.. వణుకుపుట్టిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ అంచనాలు

ABN , First Publish Date - 2023-03-12T15:35:48+05:30 IST

బాబా వాంగ (Baba Vanga) చెప్పిన చాలా జోస్యాలు నిజమవడంతో ఈ సంవత్సరంలో కూడా ఆమె చెప్పినట్లుగానే విపత్తులు సంభవిస్తాయేమోనని

Baba Vanga: 2023లో భూమికి పెనువిపత్తు?.. వణుకుపుట్టిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ అంచనాలు
Baba Vanga

న్యూఢిల్లీ : బాబా వాంగ (Baba Vanga) చెప్పిన చాలా జోస్యాలు నిజమవడంతో ఈ సంవత్సరంలో కూడా ఆమె చెప్పినట్లుగానే విపత్తులు సంభవిస్తాయేమోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో 2001 సెప్టెంబరు 11న జరిగిన ఉగ్రవాద దాడులు, Fukushima అణు విపత్తు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఎదుగుదల వంటివాటిని ఆమె ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. 5079లో ప్రపంచం అంతమైపోతుందని ఆమె చెప్పారని ఆమె అనుచరులు చెప్తున్నారు.

2023లో సౌర తుపాను (solar storm) సంభవిస్తుందని బాబా వాంగ చెప్పారు. శాస్త్రవేత్తలు చెప్తున్నదానినిబట్టి ఇది కూడా నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. సూర్యుడు దాదాపు ఓ దశాబ్దంపాటు ఉన్న స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల భూమిపై సమస్యలు రావచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యుడు క్రియాశీలకంగా ఉన్న దశలో వెలువడే సౌర మంటలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీని విడుదల చేస్తాయని, ఫలితంగా వివిధ వ్యవస్థలకు అంతరాయం కలుగుతుందని చెప్తున్నారు. పవర్ గ్రిడ్స్, జీపీఎస్ సిగ్నల్స్ వంటి వ్యవస్థలు దెబ్బతింటాయని, ఇటువంటి సంఘటనలను సోలార్ మ్యాగ్జిమమ్స్ అంటారని చెప్తున్నారు. ఇవి 11 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తాయని, గతంలో వీటివల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఆందోళన కలగలేదని అంటున్నారు.

1859లో జరిగిన కేరింగ్టన్ ఈవెంట్ వల్ల భూమిపై టెక్నలాజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ధ్వంసమైందని, దీనినిబట్టి సౌర తుపాను ప్రభావం ఎంత వినాశనకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. ఇప్పుడు మనం టెక్నాలజీపై ఆధారపడటం మరింత పెరిగినందువల్ల సౌర తుపాను ప్రభావం మరింత విపరీతంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

సోలార్ స్టార్మ్ సంభవిస్తే విద్యుత్తు సరఫరా, కమ్యూనికేషన్లు, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా సమాజంలో గందరగోళం ఏర్పడవచ్చు. ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. వీటన్నిటి ప్రభావం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగుతుంది. ప్రజల రోజువారీ జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

బాబా వాంగ ఇంకా ఏం చెప్పారంటే...

భూమి కక్ష్య 2023లో మారే అవకాశం ఉంది. దీనివల్ల పర్యావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయి.

ఓ పెద్ద దేశం జీవాయుధాల పరీక్షలను 2023లో నిర్వహిస్తుంది.

అణు విద్యుత్తు కేంద్రంలో పేలుడు వల్ల విషపూరిత మేఘాలు ఆసియాను చుట్టుముడతాయి. ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా ఇవి విస్తరిస్తాయి. ప్రజలు రోగగ్రస్థులవుతారు.

మానవులు ప్రయోగశాలల్లో జన్మించడం 2023 నుంచి ప్రారంభమవుతుంది. వారి నడవడిక, భౌతిక రూపాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. జనన ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది.

గ్రహాంతరవాసుల దాడుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు.

బల్గేరియాకు చెందిన బాబా వాంగ 1911 నుంచి 1996 మధ్య కాలంలో జీవించారు. ఆమె బాల్యంలోనే కంటి చూపును కోల్పోయారు. ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఆమెను నమ్మేవారు విశ్వసిస్తారు.

ఇవి కూడా చదవండి :

Delhi liquor scam case : జైల్లో పెట్టి నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు: మనీశ్‌

Air India : లండన్-ముంబై విమానం టాయ్‌లెట్‌లో ఆ పని చేసిన ప్రయాణికుడిపై కేసు

Updated Date - 2023-03-12T15:35:48+05:30 IST