Plane Crash : మలేసియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..

ABN , First Publish Date - 2023-08-18T10:04:07+05:30 IST

మలేసియాలో గురువారం దారుణం జరిగింది. ఓ తేలికపాటి విమానం కూలిపోవడంతో 10 మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది విమానంలో ప్రయాణిస్తున్నవారు కాగా, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ కారులోని ఓ వ్యక్తి, ఓ మోటారు బైక్‌పై వెళ్తున్న మరొక వ్యక్తి ఉన్నారు.

Plane Crash : మలేసియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..

న్యూఢిల్లీ : మలేసియాలో గురువారం దారుణం జరిగింది. ఓ తేలికపాటి విమానం కూలిపోవడంతో 10 మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది విమానంలో ప్రయాణిస్తున్నవారు కాగా, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ కారులోని ఓ వ్యక్తి, ఓ మోటారు బైక్‌పై వెళ్తున్న మరొక వ్యక్తి ఉన్నారు.

ఈ విమానం నాలుగు లేన్ల రోడ్డుపై కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుంది. వెనువెంటనే దట్టమైన నల్లని పొగ వ్యాపించింది. పోలీసు అధికారి మహమ్మద్ ఇక్బాల్ ఇబ్రహీం మాట్లాడుతూ, ఈ విమాన ప్రమాదంలో 10 మంది మరణించారని చెప్పారు. మృతుల్లో ఎనిమిది మంది విమానంలో ప్రయాణిస్తున్నవారు కాగా, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ కారులోని ఓ వ్యక్తి, ఓ మోటారు బైక్‌పై వెళ్తున్న మరొక వ్యక్తి ఉన్నారన్నారు. సెంట్రల్ పెహంగ్ స్టేట్ అసెంబ్లీమేన్ జోహారీ హరుణ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారని చెప్పారు.

మలేసియా పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, బీచ్‌క్రాఫ్ట్ మోడల్ 390 విమానం కుప్పకూలిపోయి, మంటల్లో చిక్కుకుంది. దీనిలో ఇద్దరు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం నార్తర్న్ రిసార్ట్ ఐలండ్ లంగ్‌కావి నుంచి బయల్దేరింది, సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తోంది. మలేసియా రాజధాని నగరం కౌలాలంపూర్ సమీపంలో ఈ దారుణం జరిగింది. దీనిపై ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు జరుపుతుంది.


ఇవి కూడా చదవండి :

Konark Wheel : అమెరికా టైమ్స్ స్క్వేర్‌లో కోణార్క్ చక్రం.. వికాస్ ఖన్నాను ప్రశంసించిన ఒడిశా సీఎం పట్నాయక్..

Marijuana Smuggler: గంజాయి పుష్ప

Updated Date - 2023-08-18T10:04:07+05:30 IST