Earthquake: అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

ABN , First Publish Date - 2023-05-29T10:10:10+05:30 IST

అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్‌పూర్‌లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....

Earthquake: అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
Earthquake

సోనిట్‌పూర్‌(అసోం): అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్‌పూర్‌లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.(Earthquake) 15 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.(Assams Sonitpur,Andaman and Nicobar Islands)అండమాన్ నికోబార్ దీవుల్లోనూ సోమవారం ఉదయం 7.48 గంటలకు భూకంపం సంభవించింది. అండమాన్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని అధికారులు చెప్పారు. అప్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ లో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. పాకిస్థాన్ దేశంలోని కొన్ని ప్రాంతాలు, భారతదేశంలోని శ్రీనగర్, పూంచ్, జమ్మూ, ఢిల్లీ ప్రాంతాల్లో భూప్రకంపనలతో సీలింగ్ ఫ్యాన్లు షేక్ అయ్యాయి.

Updated Date - 2023-05-29T10:43:21+05:30 IST