Gujarat: పంట నష్టపోయిన రైతులకు ప్యాకేజీ ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-09-24T14:11:51+05:30 IST

నర్మదా నది(Narmada River) పొంగి పొర్లడంతో గుజరాత్ లోని ముంపు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటల్ని రైతులు నష్టపోయారు.

Gujarat: పంట నష్టపోయిన రైతులకు ప్యాకేజీ ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

గుజరాత్: నర్మదా నది(Narmada River) పొంగి పొర్లడంతో గుజరాత్ లోని ముంపు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటల్ని రైతులు నష్టపోయారు. స్పందించిన గుజరాత్(Gujarath) ప్రభుత్వం నష్టపోయిన(Crop Loss) రైతులకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ(Compensation)ని ప్రకటించింది. పంటల రకం, సాగు విధానాన్ని బట్టి ఆర్థిక సాయం మారుతుందని అధికారులు చెబుతున్నారు. అర్హులైన రైతులు అక్టోబర్ 31 లోపు 'డిజిటల్ గుజరాత్ పోర్టల్' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నర్మదా నది పొంగిన ఘటనలో భరూచ్, నర్మదా, వడోదర జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. మూడు జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఆధారంగా ప్రత్యేక సహాయ ప్యాకేజీ అందించనున్నారు.


గరిష్టంగా రెండు హెక్టార్ల వరకు నష్టపరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. నీటిపారుదల లేని పంటలకు SDRF నిబంధనలను అనుసరించి హెక్టారుకు రూ.8 వేల 500 సాయాన్నిఅందుకుంటారు. మిగతా పంటకు హెక్టారుకు రూ.17 వేలు ఆపైనా అందజేయనున్నారు. 33 శాతం ఆపైనా నష్టపోయిన ఉద్యాన పంటలకు రూ. లక్ష ఇవ్వనున్నారు. అమౌంట్ మొత్తాన్ని నేరుగా ఆయా రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఎగువ నర్మదా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు, సర్దార్ సరోవర్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం గుజరాత్‌లో వరదలకు కారణమయ్యాయి. కాంగ్రెస్(Congress) పార్టీ దీనిని "మానవ నిర్మిత విపత్తు" అని ఆరోపించింది. డ్యామ్ నిర్వహణపై దర్యాప్తు చేయాలని కోరింది.

Updated Date - 2023-09-24T14:13:16+05:30 IST