Home » Gujarat
ఆర్థిక సమస్యలతో ఆ వివాహిత తల్లడిల్లింది. చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. కుమారుడు ఉండటం వల్ల జాబ్ చేసే పరిస్థితి లేదు. దాంతో జొమాటో డెలివరీ ఏజెంట్‌గా మారింది. తనతోపాటు పిల్లాడిని కూడా తీసుకెళుతోంది. వివాహిత జాబ్ చేస్తోండగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్అవుతోంది.
గుజరాత్లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తన సంస్మరణ కార్యక్రమం జరుగుతుండగా తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
గోద్రా రైలు దహనకాండ, గుజరాత్ అల్లర్లపై తెరకెక్కిన ‘ది సబర్మతీ రిపోర్టు’ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
Gujarat: ఆప్తులు మనల్ని విడిచి వెళ్లిపోతే కలిగే బాధ వేరు. దాని నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. వాళ్లను తలచుకోని రోజు ఉండదు. వాళ్లతో మనకు ఉండే అనుబంధం, జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.
పెద్ద ఎత్తున పేలుడు, మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కంపెనీలు, ప్రజలు భయందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటంతో వెంటనే రిఫైనరీలోని కార్మికులను సురక్షింతంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
యువత ఆలోచనలకు పదునుపెట్టడం ద్వారా మాత్రమే ఏ దేశమైన అభివృద్ధి పథంలోకి వెళ్తుందని లార్డ్ స్వామినారాయణ్ బోధించేవారని, అందుకోసం, యువతను విద్యావంతులను చేయడం, నిపుణులైన యువత అనివార్యమని ప్రధాని మోదీ చెప్పారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశంలోని యువత తమ దేశానికి వచ్చి పనిచేయాలని అక్కడి వారు కోరుకుంటున్నారని తెలిపారు.
నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిన సమాచారం తెలియగానే ఆనంద్ పోలీసులు, బ్రిగేట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్చలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగను సైనికుల మధ్య జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు (గురువారం) గుజరాత్‌లోని కచ్ఛ్‌లో సర్ క్రీక్‌లోని లక్కీ నాలా వద్ద బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులతో గడిపారు.
వస్తు సేవల పన్ను(GST) మోసానికి సంబంధించిన కేసులో 'ది హిందూ' జర్నలిస్టు మహేశ్ లంగా బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు బుధవారం కొట్టేసింది.