Share News

Narendra Modi: ఆనవాయితీని కొనసాగించిన ప్రధాని మోదీ.. సైనికులతో కలిసి దీపావళి

ABN , Publish Date - Oct 31 , 2024 | 05:03 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగను సైనికుల మధ్య జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు (గురువారం) గుజరాత్‌లోని కచ్ఛ్‌లో సర్ క్రీక్‌లోని లక్కీ నాలా వద్ద బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులతో గడిపారు.

Narendra Modi: ఆనవాయితీని కొనసాగించిన ప్రధాని మోదీ.. సైనికులతో కలిసి దీపావళి

ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగను సైనికుల మధ్య జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు (గురువారం) గుజరాత్‌లోని కచ్ఛ్‌లో సర్ క్రీక్‌లోని లక్కీ నాలా వద్ద బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులతో గడిపారు. అక్కడున్న సైనికులకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సైనికులకు స్వీట్లు పంచిపెట్టారు.


2014 నుంచి ఇదే ఆనవాయితీ

కాగా ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి వివిధ ప్రాంతాల్లోని సైనికులతో కలిసి మోదీ దీపావళి జరుపుకుంటున్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2019లో జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, 2020లో రాజస్థాన్‌లోని లాంగేవాలా, 2021లో కశ్మీర్‌లోని నౌషేరాలో, 2022 జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌లో, 2023 హిమాచల్‌లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు.


వల్లభాయ్ పటేల్ వేడుకల్లో ప్రధాని

మరోవైపు 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ సమైక్యతలో ముఖ్య పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లో ఇవాళ (గురువారం) తెల్లవారుజామున జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఘన నివాళులు అర్పించారు. సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఉన్న కెవాడియాకు వెళ్లారు. అక్కడ జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం రోజునే దీపావళి పర్వదినం రావడం ఎంతో ప్రత్యేకమని మోదీ వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని రెండేళ్లపాటు నిర్వహించనున్న వేడుకలు ప్రారంభమయ్యాయని మోదీ ప్రకటించారు.

Updated Date - Oct 31 , 2024 | 08:47 PM