Share News

Gujarat: చనిపోయాడనుకొని దహన సంస్కారాలు.. కట్ చేస్తే..

ABN , Publish Date - Nov 17 , 2024 | 05:32 PM

Gujarat: ఆప్తులు మనల్ని విడిచి వెళ్లిపోతే కలిగే బాధ వేరు. దాని నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. వాళ్లను తలచుకోని రోజు ఉండదు. వాళ్లతో మనకు ఉండే అనుబంధం, జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.

Gujarat: చనిపోయాడనుకొని దహన సంస్కారాలు.. కట్ చేస్తే..

ఆప్తులు మనల్ని విడిచి వెళ్లిపోతే కలిగే బాధ వేరు. దాని నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. వాళ్లను తలచుకోని రోజు ఉండదు. వాళ్లతో మనకు ఉండే అనుబంధం, జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే ఆ విషాదాన్ని తట్టుకోవడం కష్టం. కుటుంబంలోని కీలక వ్యక్తి విడిచి వెళ్లిపోతే ఆ బాధను మాటల్లో కూడా వర్ణించలేం. అందుకే వాళ్ల మీద ఉన్న ప్రేమ, గౌరవాన్ని వివిధ రూపాల్లో చూపిస్తూ ఉంటాం. సంస్మరణ సభలు నిర్వహించి వాళ్లను తలచుకుంటాం. వాళ్లతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటాం. ఇలాగే ఓ ఫ్యామిలీ కూడా తమ ఇంటి పెద్ద చనిపోయాడనుకొని సంస్మరణ సభ నిర్వహించారు. కానీ కర్మకాండలో ఊహించని షాక్ తగిలింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


సభ జరుగుతుండగా..

అంత్యక్రియలు, కర్మకాండ సమయంలో చనిపోయిన వారి ఆత్మ తప్పకుండా ఆ ప్రదేశానికి వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది నిజంగానే జరిగింది. గుజరాత్‌లోని మెహసనాలో గురువారం ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఏ వ్యక్తి అయితే చనిపోయాడనుకొని అతడి కుటుంబం దహన సంస్కారాలు చేసిందో.. అదే వ్యక్తి తన సంస్మరణ సభకు విచ్చేశాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో అర్థం గాక విస్మయానికి గురయ్యారు. నరోడాకు చెందిన 43 ఏళ్ల బ్రిజేష్ సుతార్ అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అక్టోబర్ 27వ తేదీన అతడు కనిపించకుండా పోయాడు.


ఇన్నాళ్లూ ఎక్కడున్నాడు?

కనిపించకుండా పోయిన బ్రిజేష్ కోసం అతడి కుటుంబీకులు ఎంతగానో వెతికారు. పోలీసులకు కూడా కంప్లయింట్ చేశారు. అయినా ఆచూకీ తెలియలేదు. అయితే నవంబర్ 10వ తేదీన సబర్మతీ బ్రిడ్జ్ దగ్గర ఒక శవాన్ని కనుగొన్నారు పోలీసులు. కుళ్లిపోయిన ఆ శవాన్ని బ్రిజేష్ కుటుంబ సభ్యులకు చూపించారు. బ్రిజేష్‌కు దానికి దగ్గరి పోలికలు ఉండటంతో ఆ బాడీ అతడిదేనని వాళ్లు భావించారు. దీంతో శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని రోజుల తర్వాత సంస్మరణ సభ నిర్వహించి ఆయన గురించి తలచుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బ్రిజేష్‌ను చూసి వాళ్లు షాక్ అయ్యారు. చనిపోయాడనుకుంటే ఎలా బతికొచ్చాడని ఆశ్చర్యానికి గురయ్యారు. అతడు ఇంటికి సేఫ్‌గా తిరిగిరావడంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇది పోలీసులకు చిక్కుముడిగా మారింది. బ్రిజేష్ ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నాడు? అనేది వాళ్లకు ప్రశ్నగా మారింది. అదే సమయంలో తమకు దొరికిన ఆ కుళ్లిపోయిన శరీరం ఎవరిది? అనేది కూడా వారిని ఆలోచనల్లో పడేసింది. ఈ కేసు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.


Also Read:

‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు

ప్రియురాలితో జాలీ రైడ్.. మార్గమధ్యంలో అడుగుపెట్టిన భార్య ఏం చేసిందంటే?

మస్క్‌ రాకెట్‌.. ఇస్రో శాటిలైట్‌

For More National And Telugu News

Updated Date - Nov 17 , 2024 | 05:37 PM