Share News

Lakshmika Sajeevan: నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2023-12-08T17:23:47+05:30 IST

వర్దమాన మలయాళ సీనీ, టెలివిజన్ నటి లక్ష్మిక సజీవన్ శుక్రవారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కన్నుమూసింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె కన్నుమూసింది.

Lakshmika Sajeevan: నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి

తిరువనంతపురం: వర్దమాన మలయాళ సీనీ, టెలివిజన్ నటి లక్ష్మిక సజీవన్ (Lakshmika Sajeevan) శుక్రవారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో కన్నుమూసింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె కన్నుమూసింది. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. 'కాక్క' అనే షార్ట్‌ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మిక మంచి పేరు తెచ్చుకుంది. పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాథక్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్మర్ సల్మాన్ వంటి చిత్రాల్లో ఆమె నటించింది.


లక్ష్మిక చివరిసారిగా నవంబర్ 2న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పటి ఒక అందమైన ఫోటోను ఆమె షేర్ చేశారు. ''హోప్. లైట్ డిస్పయిట్ ఆల్ ఆఫ్ ది డార్కెనెస్'' అంటూ ఆమె చేసిన పోస్ట్‌‌కు ఆమె అభిమానుల నుంచి ఇప్పుడు స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో నలుగురు మలయాళ నటీమణులు మరణించడం, వీరిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైన తరుణంలో చిన్న వయస్సులోనే లక్ష్మిక గుండెపోటుతో మరణించిందన్న వార్త మాలీవుడ్‌ను మరోసారి దుఃఖ సాగరంలో ముంచేసింది.

Updated Date - 2023-12-08T17:37:00+05:30 IST