Laptops: ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షలు

ABN , First Publish Date - 2023-08-04T02:53:56+05:30 IST

ఇటీవలే బియ్యం ఎగుమతుల(Exports of rice)పై ఆంక్షలు విధించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కేంద్ర ప్రభుత్వం(Central Govt) తాజాగా.. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు(Laptops, Tabs), పర్సనల్‌ కంప్యూటర్ల (Personal computers)దిగుమతులపైనా ఆంక్షలు విధించింది.

 Laptops: ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షలు

ట్యాబ్‌లు, కంప్యూటర్లపైనా... తక్షణమే అమల్లోకి

దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్ర నిర్ణయం

ప్రముఖ బ్రాండ్ల ధరలు పెరిగే అవకాశం

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఇటీవలే బియ్యం ఎగుమతుల(Exports of rice)పై ఆంక్షలు విధించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కేంద్ర ప్రభుత్వం(Central Govt) తాజాగా.. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు(Laptops, Tabs), పర్సనల్‌ కంప్యూటర్ల (Personal computers)దిగుమతులపైనా ఆంక్షలు విధించింది. వాటి దిగుమతులను నిలిపివేశామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. పరిమిత దిగుమతులకు చెల్లుబాటయ్యే లైసెన్స్‌ పొందితేనే ఈ ఉత్పత్తుల దిగుమతికి అవకాశం కల్పిస్తామని పేర్కొంది. మేకిన్‌ ఇండియా(Makein India)లో భాగంగా స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్‌(Automobile) నుంచి ఎలక్ట్రానిక్స్‌ వరకు అన్ని రంగాల్లోనూ స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు

కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పరికరాల దిగుమతులను అరికట్టడం ద్వారా విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించాలని, అదే సమయంలో స్థానిక తయారీ సామర్థ్యాలను ప్రోత్సహించాలని ల క్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో భారత్‌లోని ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్న డెల్‌, హెచ్‌పీ, ఏసర్‌, శాంసంగ్‌, పానసోనిక్‌, యాపిల్‌, లెనోవో వంటి కంపెనీలపై తీవ్రప్రభావం పడనుంది. ఇక్కడి వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా చైనాలో తయారైన వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. తాజా ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో తయారీకి ఊతమిచ్చినట్టు అవుతుంది.

ఇకపై లైసెన్స్‌ తప్పనిసరి

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్‌, ఆల్‌ ఇన్‌ వన్‌ కంప్యూటర్లు, అల్ట్రా‌స్మాల్‌ కంప్యూటర్లు, సర్వర్లువంటి ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో భారత్‌లోకి ఈ వస్తువులను తీసుకొచ్చి అమ్మాలనుకునే సంస్థలు ఇకనుంచి.. ఆయా వస్తువుల షిప్‌మెంట్‌ కోసం కేంద్రం నుంచి తప్పనిసరిగా అనుమతి లేదా లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 7 రకాల ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్లపై హెచ్‌ఎస్‌ఎన్‌ కోడ్‌ 8471కింద ఆంక్షలు విధించింది. ఈ ఆం క్షలతో భారత్‌కు దిగుమతయ్యే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ లు, పీసీల ధరలు పెరిగే అవకాశం ఉంది.

హెచ్‌ఎ్‌సఎన్‌ కోడ్‌ 8471 అంటే?

హార్మొనైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ నోమెన్‌క్లేచర్‌ (హెచ్‌ఎస్‌ఎన్‌) కోడ్‌ పన్ను ప్రయోజనాల కోసం ఉత్పత్తులను గుర్తించడానికి ఉపయోగించే వర్గీకరణ వ్యవస్థ. డేటా ప్రాసెసింగ్‌ పరికరాలను ఈ హెచ్‌ఎ్‌సఎన్‌ కోడ్‌ 8471 కింద గుర్తిస్తారు. ఐటీ హార్డ్‌వేర్‌ కోసం ఇటీవల పునరుద్ధరించిన ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) పథకం కింద ఈ ఉత్పత్తుల దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ఆంక్షల నిర్ణయం తీసుకుంది.


యాపిల్‌ మ్యాక్‌బుక్‌, మినీ ధరలు పెరగొచ్చు

ప్రస్తుతం దేశంలో యాపిల్‌తోపాటు హెచ్‌పీ, డెల్‌, లెనోవో, ఏసర్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు భారత్‌లో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లు, ట్యాబ్‌లను విక్రయిస్తున్నాయి. అయితే చాలావరకు కంపెనీలు చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిన్నాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రత్యేక అనుమతి లేదా లైసెన్స్‌ తీసుకుంటే తప్ప ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కుదరదు. కాబట్టి భారత్‌లో ఈ ఎలక్ట్రానిక్స్‌కు డిమాండ్‌ ఏర్పడుతుంది. దీంతో యాపిల్‌, లెనోవో, హెచ్‌పీవంటి కంపెనీలు ధరలు పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆయా కంపెనీలు దేశీయంగా తయారీ చేపడితే వాటి ధరలు తగ్గవచ్చంటున్నారు. ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షల ప్రభావం వచ్చే రోజుల్లో స్పష్టంగా పడనున్నప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటి ధరలు పెరగొచ్చని నిపుణులు పేర్కొన్నారు. యాపిల్‌ మ్యాక్‌ బుక్‌, మ్యాక్‌ మినీతోపాటు హెచ్‌పీ, లెనోవో, ఏసర్‌ వంటి కంపెనీల ఉత్పత్తుల ధరలు పెరగొచ్చని తెలిపారు.

మార్కెట్‌పై ప్రభావం ఎంత?

కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే స్థానిక ఎలకా్ట్రనిక్స్‌ తయారీ సంస్థల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా షేర్‌ విలువ 3.3%, డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా 5.5%, పీజీ ఎలక్ట్రో‌ప్లాస్ట్‌ 2.8% పెరిగాయి. అలాగే భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, మ్యాక్‌బుక్‌ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

వాటికి మాత్రం మినహాయింపు

ఈ కామర్స్‌ పోర్టల్స్‌లో కొనుగోలు చేసి పోస్ట్‌ లేదా కొరియర్‌ ద్వారా దిగుమతి చేసుకునే వాటికి ఈ ఆంక్షలు వర్తించవని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే బ్యాగేజీ రూల్స్‌ కింద చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించబోవని తెలిపింది. అంటే దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తారు. వాళ్లు విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల వంటివి కొనుగోలు చేసి వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను కస్టమ్స్‌ అధికారులకు చూపిస్తే వాటికి అనుమతిస్తారు.

ప్రస్తుతం దేశంలో యాపిల్‌తోపాటు హెచ్‌పీ, డెల్‌, లెనోవో, ఏసర్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు భారత్‌లో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లు, ట్యాబ్‌లను విక్రయిస్తున్నాయి. అయితే చాలావరకు కంపెనీలు చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిన్నాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రత్యేక అనుమతి లేదా లైసెన్స్‌ తీసుకుంటే తప్ప ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కుదరదు. కాబట్టి భారత్‌లో ఈ ఎలక్ట్రానిక్స్‌కు డిమాండ్‌ ఏర్పడుతుంది. దీంతో యాపిల్‌, లెనోవో, హెచ్‌పీవంటి కంపెనీలు ధరలు పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆయా కంపెనీలు దేశీయంగా తయారీ చేపడితే వాటి ధరలు తగ్గవచ్చంటున్నారు. ల్యాప్‌టాప్‌లు దిగుమతులపై ఆంక్షల ప్రభావం వచ్చే రోజుల్లో స్పష్టంగా పడనున్నప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటి ధరలు పెరగొచ్చని నిపుణులు పేర్కొన్నారు. యాపిల్‌ మ్యాక్‌ బుక్‌, మ్యాక్‌ మినీతోపాటు హెచ్‌పీ, లెనోవో, ఏసర్‌ వంటి కంపెనీల ఉత్పత్తుల ధరలు పెరగొచ్చని తెలిపారు.

Updated Date - 2023-08-04T04:34:00+05:30 IST