Share News

మరో స్వదేశీ విమాన వాహక నౌకకు ఓకే..!

ABN , First Publish Date - 2023-11-29T05:09:21+05:30 IST

హిందూమహాసముద్ర ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. రూ.40 వేల కోట్ల భారీ వ్యయంతో

మరో స్వదేశీ విమాన వాహక నౌకకు ఓకే..!

న్యూఢిల్లీ, నవంబరు 28: హిందూమహాసముద్ర ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. రూ.40 వేల కోట్ల భారీ వ్యయంతో రెండో స్వదేశీ విమాన వాహక యుద్ధనౌకను నిర్మించాలన్న భారత నావికాదళ ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఐఏసీ-2గా పిలిచే ఈ విమానవాహక యుద్ధనౌక నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని, రక్షణ మంత్రిత్వ శాఖలోని కీలకమైన డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డ్‌ (డీపీబీ) దీనికి సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని డీఏసీ గురువారం సమావేశం కానుందని, ఐఏసీ-2 ప్రతిపాదనను పరిశీలిస్తుందని సమాచారం.

Updated Date - 2023-11-29T07:02:52+05:30 IST