Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి వద్దు : శిరోమణి అకాలీ దళ్

ABN , First Publish Date - 2023-07-15T13:22:40+05:30 IST

ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)ని శిరోమణి అకాలీ దళ్ (SAD) వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని చెప్పింది. దీనిపై నిజాయితీగా దేశవ్యాప్తంగా అన్ని మతాల ఏకాభిప్రాయం పొందకుండా, దీనిని అమలు చేయడం సరికాదని, మరీ ముఖ్యంగా అల్ప సంఖ్యాకుల సమ్మతి పొందాలని తెలిపింది.

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి వద్దు : శిరోమణి అకాలీ దళ్
Sukhbir Singh Badal

చండీగఢ్ : ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)ని శిరోమణి అకాలీ దళ్ (SAD) వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని చెప్పింది. దీనిపై నిజాయితీగా దేశవ్యాప్తంగా అన్ని మతాల ఏకాభిప్రాయం పొందకుండా, దీనిని అమలు చేయడం సరికాదని, మరీ ముఖ్యంగా అల్ప సంఖ్యాకుల సమ్మతి పొందాలని తెలిపింది. అలా కాని పక్షంలో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమే అవుతుందని, ప్రజల్లో భయాందోళనలు, అపనమ్మకం, విభజన మనోభావాలు పెరుగుతాయని హెచ్చరించింది. ఈ మేరకు 22వ లా కమిషన్‌కు ఓ లేఖను రాసింది.

శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ లా కమిషన్ మెంబర్ సెక్రటరీకి రాసిన లేఖలో, ఏకరూపత, ఐక్యత మధ్య తేడాలను గుర్తించడంలో గందరగోళపడవద్దని చెప్పారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని చెప్పారు. ఈ దేశం ఏకరూపతకు చిహ్నం కాదని స్పష్టం చేశారు. కేవలం నిజమైన సమాఖ్య నిర్మాణం మాత్రమే మన సమస్యలను పరిష్కరించగలుగుతుందన్నారు. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని, దీనిపై నిజాయితీగా దేశవ్యాప్తంగా అన్ని మతాల ఏకాభిప్రాయం పొందకుండా, దీనిని అమలు చేయడం సరికాదని, మరీ ముఖ్యంగా అల్ప సంఖ్యాకుల సమ్మతి పొందాలని తెలిపారు. అలా కాని పక్షంలో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమే అవుతుందని, ప్రజల్లో భయాందోళనలు, అపనమ్మకం, విభజన మనోభావాలు పెరుగుతాయని హెచ్చరించారు.

దేశభక్త సిక్కు సమాజం మనోభావాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యూసీసీ విషయంలో ముందడుగు వేయవద్దని కోరారు. ముసాయిదా యూసీసీ బిల్లును తయారు చేయలేదు కాబట్టి తగిన సలహాలు ఇవ్వడం సాధ్యంకాదన్నారు. సవివరమైన ముసాయిదాను ప్రజల ముందు ఉంచాలని, వారి అభిప్రాయాలను స్వీకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు

Updated Date - 2023-07-15T13:22:40+05:30 IST