Share News

కశ్మీరీ విద్యార్థులపై ‘ఉపా’ కేసులు

ABN , First Publish Date - 2023-11-29T05:08:46+05:30 IST

శ్రీనగర్‌, నవంబరు 28: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు ఓడిపోయినప్పుడు దేశం యావత్తు విచారం వ్యక్తం చేసి.. టీమిండియాకు మద్దతుగా

కశ్మీరీ విద్యార్థులపై ‘ఉపా’ కేసులు

శ్రీనగర్‌, నవంబరు 28: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు ఓడిపోయినప్పుడు దేశం యావత్తు విచారం వ్యక్తం చేసి.. టీమిండియాకు మద్దతుగా నిలిచింది. అయితే, ఇదే సమయంలో జమ్ముకశ్మీర్‌ వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిని సీరియ్‌సగా తీసుకున్న అధికారులు సంబరాలు చేసుకున్న ఏడుగురు విద్యార్థులపై సోమవారం ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. విద్యార్థులపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని పీడీపీ చీఫ్‌ ముఫ్తీ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఆస్ట్రేలియా జట్టును స్టేడియంలోనే అభినందించారు. ఇక్కడి విద్యార్థులు ఆస్ట్రేలియా గెలిచినందుకు సంబరాలు చేసుకున్నారు. ఇది తప్పెలా అవుతుంది’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-29T07:08:12+05:30 IST