Wife-Husband Relationship: ఈ 4 టిప్స్‌ను పాటిస్తే చాలు.. విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కూడా కలిసిపోవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-07-24T12:24:17+05:30 IST

సంబంధం ఏదయినా సరే, గౌరవ భావం అవసరం. భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం.

Wife-Husband Relationship: ఈ 4 టిప్స్‌ను పాటిస్తే చాలు.. విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కూడా కలిసిపోవడం ఖాయం..!
couples

దాంపత్యంలో ఇద్దరు పదికాలాలపాటు కలిసి ఉండాలంటే ఆ ఇద్దరి మధ్యా నమ్మకం, ప్రేమ అనేవి మెండుగా ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ గట్టిగా ఉంటుంది. ఒకరికి ఒకరు సమయాన్ని ఇచ్చుకుంటూ పోతే స్పర్థలనేవి లేకుండా సుఖంగా సాఫీగా సాగిపోతుంది జీవితం. అదే కాస్త బ్యాలెన్స్ తప్పినా కూడా ఇద్దరూ ఆ బంధంలో కొనసాగే అవకాశం ఉండదు. ఇదే తరహాలో ఇప్పటి రోజుల్లోని బంధాలు ఉంటున్నాయి. ఒకరికి ఒకరు అన్నట్టుగా సాగేవి పూర్వం రోజుల్లో భార్యాభర్తల బంధాలు. మరిప్పుడో అడుగడుగునా మనస్పర్థలు, అనుమానాలతో సాగుతుంది. దీనికి ఏ కాస్త చోటిచ్చినా ఆ రిలేషన్ విడిపోయే వరకూ వెళిపోతుంది. అందుకే ఇద్దరు కలిసి ఉండాలంటే వారికి ఈ నాలుగు సూత్రాలు తప్పని సరి.

ఏదైనా బలమైన సంబంధానికి పునాది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వేస్తారు. బంధాలు బలపడాలంటే ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ, ఆప్యాయతలుండాలి. ఈ అలవాట్ల వల్ల ప్రేమ ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుంది. అవేమిటంటే..

రిలేషన్ షిప్ బిల్డింగ్

ప్రతి రిలేషన్‌ షిప్‌లోనూ భర్త వినేవాడు అయితే భార్య చెబుతూ ఉంటుంది. ఒక్కో రిలేషన్‌లో భార్య వినే ఆమె అయితే భర్త చెబుతూ ఉంటాడు. అయితే భాగస్వాములిద్దరూ ఒకరినొకరు వినడం చాలా సంబంధాలలో జరుగుతూ ఉంటుంది. ఇది ఇద్దరి మధ్యా సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. మనసులో ఆలోచనలను, కోర్కెలను ఇలా ప్రతి విషయాన్ని చెబుతూ ఉండాలి. అదే మనసులో ఆలోచనలను పంచుకునే గుణం లేకపోతే మాత్రం దీనివల్ల చాలాసార్లు మనసులో పెట్టుకోవడం వల్ల గొడవలు, జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దానిని వెంటనే పంచుకోవడం ముఖ్యం.

నమ్మకం ముఖ్యం..

నమ్మకం లేని సంబంధాలు, తరచుగా విడిపోతూ ఉంటారు. అందుకే ఒకరినొకరు నమ్మాలి. ఎదుటివారి మాటలు వినేముందు ఒకసారి మనతో ఉండే వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకోవడం ముఖ్యం. మన వాళ్ళను మనమే నమ్మే విధంగా ట్రై చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరినొకరు విశ్వసించాలి. ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ రిలేషన్ షిప్‌కి మంచిదని రుజువు చేస్తుంది.


ఇది కూడా చదవండి: ఇవేం నీళ్లు..? పసుపు రంగులో ఉన్నాయేంటని అవాక్కవుతున్నారా..? వీటిని రోజూ పొద్దున్నే తాగితే..!

తక్కువ గౌరవం..

సంబంధం ఏదయినా సరే, గౌరవ భావం అవసరం. భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం. గౌరవం లేని చోట, భాగస్వాముల్లో సంకోచించడం ప్రారంభమవుతుంది. ఇది ఇద్దరి మధ్యా మనస్పర్థలు తెచ్చేలా చేస్తుంది. అందుకే పరస్పరం గౌరవించుకోవడం ముఖ్యం.

అభినందించుకోవడం మర్చిపోవద్దు.

ఇరిద్దరూ ఒకరినొకరు అభినందించుకోవడం చాలా ముఖ్యం. ఇద్దిరికీ ఏం ఇష్టం అనేది ఒకరికొకరు తెలుసుకోవాలి. భాగస్వామి అందంగా కనిపించినప్పుడు, ఏదైనా మంచి చేసినప్పుడు, మంచి అనుభూతిని కలిగించినప్పుడు, ఈ విషయాన్ని భాగస్వామికి చెబుతూ ఉండాలి.

దీనితో వారికి మీరు తన విషయంలో అన్నీ గమనిస్తున్నారనే ఎరుకతో ఉంటారు. నిజానికి ప్రతి భార్యా తన భర్త తనని ఎక్కువగా ప్రేమించాలని, తనతోనే ఉండాలని, తను ఒక్కరే అతని జీవితంలో స్త్రీ అని నమ్ముతుంది. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ ముందుకు వెళితే ఆ బంధం కలకాలం సుఖంగా ఉంటుంది.

Updated Date - 2023-07-24T12:24:17+05:30 IST