Partner: దంపతులూ జరజాగ్రత్త!.. ఈ 7 అలవాట్లు ఉంటే మీ భాగస్వామి దూరమయ్యే ప్రమాదం ఉంది.. అవి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-01T15:10:51+05:30 IST

కాస్త తేడాగా ప్రవర్తించినా కూడా ఇద్దరి మధ్యా అగాధం వచ్చి పడుతుంది.

Partner: దంపతులూ జరజాగ్రత్త!.. ఈ 7 అలవాట్లు ఉంటే మీ భాగస్వామి దూరమయ్యే ప్రమాదం ఉంది.. అవి ఏంటంటే..
Relationship

ఇప్పటి రోజుల్లో చాలా మంది యువత ముందు పరిచయం కాగానే ప్రేమనే ఫీలింగ్ చెప్పుకోగానే డేటింగ్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. దీనిలో ఇద్దరిమధ్యా సాన్నిహిత్యంతో పాటు ఒకరినొకరు అర్థంచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ స్థితిలో కాస్త గమనింపు అవసరం. కాస్త తేడాగా ప్రవర్తించినా కూడా ఇద్దరి మధ్యా అగాధం వచ్చి పడుతుంది. మీలోని కొన్ని అలవాట్లను గురించి కూడా మీ భాగస్వామికి దాపరికంలేకుండా చెప్పేయడమే నయం. వాళ్లతో కాస్త ఆచి తూచి ఉండటమూ మంచిదే.. అది ఏ విషయాల్లో అంటే..

1. చాలా ఎక్కువగా 'మాజీ' టాక్

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మన జీవితంలోకి వచ్చే అందరూ మనతోనే చివరికంటా ఉండనూ ఉండరు. అయితే మీ భాగస్వామి ఎంత ప్రోగ్రెసివ్ అయినా సరే మీ మాజీ గురించి, గతం గురించి పదే పదే మీ వాళ్ళతో మాట్లాడకండి. వాళ్ళ గురించి అన్ని వేళల్లోనూ పంచుకోవడం వల్ల అసహనం కలిగించవచ్చు. కాబట్టి ఆ మాటలు వద్దు.

2. మెస్డ్ అప్ కమ్యూనికేషన్

కొత్తగా పరిచయం అయిన వారితో సక్యంగా మాట్లాడటం, వాళ్ళు చెప్పేది ఓపికగా వినడం, తిరిగి సమాధానం చెప్పడం రెండూ మీ మధ్య స్నేహాన్ని పెంచుతాయి.

3. లోపాలు ఎంచవద్దు.

ఇద్దరి మధ్య మంచి సంబంధం కొనసాగాలంటే మాత్రం ఒకరిమీద ఒకరికి నమ్మకమనే పునాది తప్పక కావాలి. అయితే వ్యక్తిత్వానికి సంబంధించి లోపాలను ఎంచడం, తప్పులు ఎంచడం వల్ల సంబంధంలో చీలికలు వస్తాయి.

4. మిశ్రమ ఫలితాలు ఇస్తే..

ఏదైనా సమస్య వచ్చినపుడు మీ నిర్ణయం ఎలా ఉన్నా ముక్కుసూటిగా ఉండటం మంచిది. లేదంటే సమస్యను పెంచిన వారు అవుతారు. లేదా సమస్యలో తప్పుడు నిర్ణయం తీసుకుని బాధపడవలసి వస్తుంది. ఎప్పుడూ గిల్డ్ పడాల్సిన పరిస్థి‌తిని కొని తెచ్చుకోవద్దు.

ఇది కూడా చదవండి: మగాళ్లూ.. వయసు కనబడుతోందని తెగ బాధపడిపోతున్నారా?.. అయితే ఈ 7 ఆహార పదార్థాలు తినండి చాలు..

5. నకిలీగా ఉండటం

ఏదైనా విషయంలో మీ అభిప్రాయం చెప్పాల్సి వస్తే మాత్రం ఆ విషయం నచ్చకపోయినా నచ్చిందని, మీకు సమ్మతమేననే విషయాన్ని చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఫేక్‌గా మారకండి. మీరు నటిస్తే అది మీ భాగస్వామికి తెలిసిపోతుంది.

6. అస్తమానూ ఫిర్యాదులు వద్దు.

మీకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దానితో గొడవ పెట్టుకోవడం, ఇబ్బంది పెట్టడం లేదా ఫిర్యాదు చేయడం వల్ల పరిస్థితి మరీ విషమంగా తయారవుతుంది. మీ భాగస్వామి నుండి ఏదైనా అవసరం అయితే, 'డిమాండ్' కాకుండా 'అడగడానికి' ప్రయత్నం చేయండి.

7. వ్యక్తిగతగా ఎక్కువగా చొరబడడం

రిలేషన్‌లో ఉండవచ్చు కానీ, అది మీ భాగస్వామి వ్యక్తిగత స్పేస్‌లోకి చొరబడే హక్కును మీకు ఇవ్వదు. అస్తమానూ ప్రతిదానికి వారిని ప్రతి అప్‌డేట్‌ను అడగడం, అనుమతి లేకుండా వారి ఫోన్‌ని చెక్ చేయడం, పింగ్ చేయడం వంటివి చికాకు కలిగించవచ్చు. కాబట్టి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నంత మాత్రాన అరమరికలు లేకుండా ఉన్నా కూడా కాస్త హద్దులను దాటకుండా ఉండటమే బంధాన్ని నిలపడంలో సహకరిస్తుంది.

Updated Date - 2023-03-01T15:10:51+05:30 IST