Share News

Kiwi : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-10-17T23:19:43+05:30 IST

ఆస్ర్టిచ్‌ తర్వాత అది పెద్ద పక్షి ‘కివి’. పొట్టి కాళ్లు, పొడవైన ముక్కు ఉండే ఈ పక్షి... న్యూజిలాండ్‌ జాతీయ పక్షి. దీంతో ఈ పక్షి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.

Kiwi : మీకు తెలుసా?

  • ఆస్ర్టిచ్‌ తర్వాత అది పెద్ద పక్షి ‘కివి’. పొట్టి కాళ్లు, పొడవైన ముక్కు ఉండే ఈ పక్షి... న్యూజిలాండ్‌ జాతీయ పక్షి. దీంతో ఈ పక్షి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ దేశంలో ఐదు రకాల కివి పక్షులు ఉన్నాయి.

  • రాత్రిపూట ఈ పక్షులు చురుగ్గా ఉంటాయి. ‘కీ కీ కీ’ అనే శబ్దంతో అరుస్తాయి.

  • మడగాస్కర్‌లోని ఎలిఫెంట్‌ పక్షి జాతికి చెందినదే ఇది. వాసన చూడటం, దూరంగా ఉండే ఇతర జీవుల కదలికలను గమనించటంలో చాలా చురుకు.

  • వీటి ఎముకలు గట్టిగా ఉండటం వల్ల సులువుగా గాల్లోకి ఎగరలేవు.

  • శరీరంతో పోలిస్తే వీటి కళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. పండ్లు, పురుగులు, విత్తనాలు, చిన్న చేపలను తింటాయివి.

  • ఈ పక్షి బరువులో పావుశాతం ఎంత ఉంటుందో అంత బరువైన గుడ్డు పెడుతుంది. ఒక పెద్ద కోడిగుడ్డుకు ఆరు రెట్లు బరువు ఉంటుంది. గ్రీనిష్‌ వైట్‌ రంగులో ఉంటుంది. 62 రోజుల నుంచి 92 రోజుల వరకూ వీటి పొదిగేకాలం. మగ, ఆడపక్షులు రెండూ గుడ్డు మీద పొదుగుతాయి.

  • అడవుల్లో ఉండే కివిలు వాటి బలమైన గోళ్లతో గుంతను తవ్వుతాయి. అదే గూడుగా ఉపయోగించుకుంటాయి.

  • వీటి కాళ్లు బలమైనవి. శరీరంలో మూడో వంతు కాళ్ల బరువు ఉంటుంది. ఇతర జీవలకు శబ్ధం వినిపించకుండా... మెల్లగా నడుస్తుంది, వీలైతే వేగంగా పరిగెత్తుతుంది. వాటి గోళ్లతో దాడికి దిగుతుంది.

  • ఇవి సుమారు అరవై ఏళ్ల వరకూ బతుకుతాయి.

  • కివి పిల్లలకు మనుషులు, కుక్కలు, పిల్లులు వల్ల ప్రమాదం ఉంది. అందుకే పుట్టిన కివిల్లో చివరగా కేవలం ఐదు శాతమే బతుకుతాయి.

Updated Date - 2023-10-17T23:19:43+05:30 IST