Share News

బీర్బల్‌ తెలివైన సమాధానం

ABN , First Publish Date - 2023-11-08T02:32:56+05:30 IST

అక్బర్‌, బీర్బల్‌ ఒక పనిమీద విదేశానికి వెళ్లి వచ్చారు. రాజ్యంలో మాట్లాడుకున్నారు. కాసేపు నడిచారు. సెలవు తీసుకుని బీర్బల్‌ ఇంటికి వెళ్లిపోయాడు.

బీర్బల్‌ తెలివైన సమాధానం

అక్బర్‌, బీర్బల్‌ ఒక పనిమీద విదేశానికి వెళ్లి వచ్చారు. రాజ్యంలో మాట్లాడుకున్నారు. కాసేపు నడిచారు. సెలవు తీసుకుని బీర్బల్‌ ఇంటికి వెళ్లిపోయాడు.

మరసటి రోజు ఉదయం సభ ప్రారంభమైంది. అక్బర్‌ మంత్రులతో మాట్లాడాడు. సరదాగా కొందరు మంత్రులు కొన్ని కబుర్లు చెప్పారు. ‘నిజానికి అబద్ధానికి’ తేడా ఏమిటి? అని ప్రశ్నించాడు అక్బర్‌. అది కూడా మూడు మాటల్లోపే సమాధానం ఉండాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మంత్రులు, సభలోని మిగతావాళ్లు ఏమీ మాట్లాడలేదు. ఏమి మాట్లాడినా.. ఎలాంటి సమాధానం చెప్పినా కోపం వస్తుందని కొందరు ఊరుకుండిపోయారు. అదేంటీ నేను అంత కఠినమైన ప్రశ్న అడిగానా? నిజానికి- అబద్ధానికి తేడా ఏంటీ? అనేది చిన్న ప్రశ్నే కదా అన్నారు అక్బర్‌.

సమాధానం చెప్పటానికి ఎవరూ ముందుకు రాలేదు. అందరూ భయస్తులే. ఆ క్షణంలో ఆలస్యంగా వచ్చిన బీర్బల్‌ను అక్బర్‌ చూశారు. అయ్యగారూ ఇంత ఆలస్యమేమిటి? అన్నారు. దారిలో చిన్న సమస్య వస్తే దాన్ని పూర్తి చేసి వస్తున్నాను. అందుకే ఈ ఆలస్యం బాద్‌షా అన్నాడు బీర్బల్‌. అవునా.. అయితే నిజానికి, అబద్ధానికి తేడా ఏమిటి? అది కూడా మూడు మాటల్లోనే చెప్పాలి అన్నాడు అక్బర్‌. అప్పుడు బీర్బల్‌ కాస్త ఆలోచించి.. ‘ఓస్‌ ఇంతేనా? సమాధానం దొరికింది’ అన్నాడు. అందరూ చెవులు రిక్కిరించారు. ‘కేవలం నాలుగు వేళ్లే’ అన్నాడు బీర్బల్‌. అందరికీ సమాధానం తెలీయట్లేదు కాబట్టి బిక్కమొహం వేసుకున్నారు. అంతలోనే అక్బర్‌ ఇలా అన్నాడు.. ‘ఇక ఎందుకు క్లుప్తంగా చెప్పండి?’ అన్నాడు. బీర్బల్‌ వెంటనే ఇలా అన్నాడు. ‘జహాపనా.. కళ్లకు, చెవులకు మధ్య దూరం నాలుగువేళ్లే’ అన్నాడు. అయితే? అన్నాడు అక్బర్‌. కళ్లు నిజం చూస్తాయి. సత్యమే ఎప్పుడూ. అయితే చెవులకు అబద్ధం వినపడుతుంది. ఆ లెక్కన నిజానికి, అబద్ధానికి మధ్యదూరం నాలుగువేళ్లే కదా? అన్నాడు. అక్బర్‌ ఎంతో సంతోషపడ్డారు. బీర్బల్‌ను అభినందించటంతో పాటు బంగారు నాణేలు ఇచ్చి పంపించారు అక్బర్‌. అందరూ చప్పట్లు కొట్టారు.

Updated Date - 2023-11-08T02:32:56+05:30 IST