Highland Cow : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-09-28T00:04:28+05:30 IST

గోధుమరంగు జుట్టు, కళ్లమీద కూడా కదిలే జుట్టుతో పాటు పొడవైన కొమ్ములుండే ఈ ఆవును ‘హైలాండ్‌ కౌ’ అని పిలుస్తారు. వీటినే ‘స్కాటిస్‌ క్యాటిల్‌’, ‘స్కాటిస్‌ హైలాండ్‌ కౌ’, ‘

 Highland Cow : మీకు తెలుసా?

  • గోధుమరంగు జుట్టు, కళ్లమీద కూడా కదిలే జుట్టుతో పాటు పొడవైన కొమ్ములుండే ఈ ఆవును ‘హైలాండ్‌ కౌ’ అని పిలుస్తారు. వీటినే ‘స్కాటిస్‌ క్యాటిల్‌’, ‘స్కాటిస్‌ హైలాండ్‌ కౌ’, ‘వెస్ట్‌ హైలాండ్‌ క్యాటిల్‌’ అని కూడా పిలుస్తారు.

  • ఇవి కొన్ని నలుపు రంగులో కూడా ఉంటాయి.

  • ఒకప్పుడు స్కాట్లాండ్‌కు ఇవే ఆర్థిక సంపద. 1724 వ సంవత్సరంలో బ్రిటిషర్లు ఈ అవుల్ని 30 వేలకు పైగా స్కాట్లాండ్‌ నుంచి కొన్నారట. 1884 వ సంవత్సరం నుంచి వీటి సంతతి అభివృద్ధి చెందింది.

  • ఇవి స్కాటాండ్‌లోని భూముల్లోనే కాకుండా ఐలాండ్స్‌లోనూ నివసిస్తాయి.

  • వీటి పాలల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో ఆవు 500 కేజీల బరువు ఉంటే.. ఎద్దు మాత్రం 800 కేజీల బరువు ఉంటుంది.

  • వెస్ట్‌ హైలాండ్‌, హైలాండ్స్‌లో జీవించే ఆవుల్ని రెండు రకాలుగా స్కాట్లాండ్‌ వర్గీకరించింది. వెస్ట్‌ హైలాండ్‌ కాస్త చిన్నవి. నల్లగా ఉంటాయి. అయితే హైలాండర్‌లో మాత్రం బతికినవి బలమైనవి. పెద్దవి.

  • ఎలిజబెత్‌ రాణికి హైలాండర్స్‌లోని ఆవులు మాత్రమే ఇష్టమట. అంతేనా వాటి మాంసమూ ఆమెకు ఇష్టమని పుకార్లు వచ్చాయి. వాస్తవానికి వాటి మీట్‌కోసమే ఐరోపా దేశాలవాళ్లు తెగ ఆరాటపడతారు.

  • ఎద్దుల కొమ్ములు వైడ్‌గా ఉంటే ఆవుల కొమ్ములు షార్ప్‌తో పాటు పొడవుగా ఉంటాయి.

  • హైలాండ్స్‌లో ఉండే ఆవులు గడ్డితో పాటు గింజలు, పండ్లు, కార్న్‌లను ఇష్టంగా తింటాయి.

  • ఇవి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి.

  • రోజులో ఎనిమిది గంటల్లో కనీసం డెబ్భయ్‌ కేజీల ఆహారాన్ని తింటాయి. ఆ తర్వాత నెమరేస్తుంటాయి. తెలివైనవి జంతువులివి.

  • పదిహేను సంవత్సరాలనుంచి ఇరవై సంవత్సరాల దాకా వీటి జీవనకాలం ఉంటుంది.

Updated Date - 2023-09-28T00:04:28+05:30 IST