Singapore: ఇద్దరు భారతీయ వర్కర్లకు భారీ జరిమానా.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2023-01-28T13:25:46+05:30 IST

ఇద్దరు భారతీయ వర్కర్లకు (Indian Workers) సింగపూర్ న్యాయస్థానం (Singapore Court) ఒక్కొక్కరికి 24 వేల సింగపూర్ డాలర్ల (సుమారు రూ.15లక్షలు) చొప్పున జరిమానా (Fine) విధించింది.

Singapore: ఇద్దరు భారతీయ వర్కర్లకు భారీ జరిమానా.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

సింగపూర్ సిటీ: ఇద్దరు భారతీయ వర్కర్లకు (Indian Workers) సింగపూర్ న్యాయస్థానం (Singapore Court) ఒక్కొక్కరికి 24 వేల సింగపూర్ డాలర్ల (సుమారు రూ.15లక్షలు) చొప్పున జరిమానా (Fine) విధించింది. లంచం తీసుకున్న కేసులో ఇలా ఇద్దరు భారతీయులకు అక్కడి కోర్టు భారీ జరిమానా వేసింది. కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మహేశ్వరన్ ఎం రతీనా సవపతి (27), రెనిత మురళీధరన్ (31) అక్కడి ఆహార పంపిణీ సంస్థ సొన్నమెరాలో పనిచేశారు. 2020లో కంపెనీ గోదాం సూపర్‌వైజర్‌గా (Supervisor) ఉన్న రతీనా సవపతి, మ్యాన్‌పవర్ కాంట్రాక్ట్ సేవల సంస్థ ఇన్‌స్పిరోలో డైరెక్టర్‌గా ఉన్న హేమ సుతన్‌ నాయర్ నుంచి 6,800 సింగపూర్ డాలర్ల (రూ.4.21లక్షలు) లంచాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత మురళీధరన్‌కు తన వాటా కమీషన్‌ కింద 3,400 సింగపూర్ డాలర్లు (రూ.1.10లక్షలు) ఇచ్చాడు. ఇద్దరిపై అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఒక్కొక్కరికి రూ.15లక్షల జరిమానా విధించింది. ఇక అవినీతి వ్యవహారాల ఇన్వెస్టిగేషన్ బ్యూరో జనవరి 2021లో ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంది.

ఇదిలాఉంటే.. ఓ దొంగతనం కేసులో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం గత నెలలో 42 నెలల జైలు శిక్ష విధించింది. జనవరి 2020లో ఖాళీగా ఉన్న కాలేజ్ నుంచి కాపర్ వైర్లు, కేబుల్స్ దొంగిలించినందుకు న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. నిందితుడిని ఓం శక్తి తివారీగా గుర్తించారు. ఇతడు తనతో పాటు పనిచేసే బంగ్లాదేశ్ వ్యక్తితో కలిసి కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తెలింది. తొలుత 994 కిలోల కేబుల్‌ను రీ సైక్లర్స్‌కు 3,976 సింగపూర్ డాలర్లకు (రూ.2.46లక్షలు), ఆ తర్వాత మరో 773 కిలోల కేబుల్‌ను అదే దుకాణదారుడికి మరో 3,976 సింగపూర్ డాలర్లకు (రూ.2.46లక్షలు) విక్రయించాడు.

Updated Date - 2023-01-28T13:25:47+05:30 IST