AP Politics : వామ్మో.. జగన్ సర్కార్ మరీ ఇంత దిగజారిందేంటి.. ఈ విషయం గానీ మీకు తెలిస్తే..!?

ABN , First Publish Date - 2023-08-11T20:58:25+05:30 IST

వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) తీసుకునే నిర్ణయాలు దరిద్రంగా ఉన్నాయని ప్రతిపక్షాల నోట ప్రతిరోజూ వింటూనే ఉన్నాం.!. పోనీ ఈసారైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందా..? అని ఆశించిన ప్రతిసారీ మరో చెత్త నిర్ణయం తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి..

AP Politics : వామ్మో.. జగన్ సర్కార్ మరీ ఇంత దిగజారిందేంటి.. ఈ విషయం గానీ మీకు తెలిస్తే..!?

వైఎస్ జగన్ సర్కార్ (YS Jagan Govt) తీసుకునే నిర్ణయాలు దరిద్రంగా ఉన్నాయని ప్రతిపక్షాల నోట ప్రతిరోజూ వింటూనే ఉన్నాం.!. పోనీ ఈసారైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందా..? అని ఆశించిన ప్రతిసారీ మరో చెత్త నిర్ణయం తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అధికారంలోకి రాగానే ప్రజావేదికతో మొదలైన ఇంతవరకూ చెప్పుకోదగిన నిర్ణయాలు తీసుకోలేదన్నది జగమెరిగిన సత్యమేనని ఇందులో ప్రత్యేకించడానికి ఏమీలేదని రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అయితే ఆ నిర్ణయాలు ఏమిటనేది అటుంచితే.. ఈ మధ్య మరీ బరితెగించే నిర్ణయాలు తీసుకుంటోంది జగన్ సర్కరార్!. సీన్ కట్ చేస్తే.. ఎన్నికల ముందు మరీ చెత్త నిర్ణయాలు తీసుకోవడంలో ఆరితేరిపోతోంది. తాజాగా.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) మాట్లాడిన మాటలు పెను వివాదానికి దారితీశాయి. ఇంత జగన్ సర్కార్ నిర్ణయమేంటి..? ఆర్థిక మంత్రి ఎందుకీ ప్రకటన చేశారు..? ఈ ప్రకటనతో వచ్చిన చిక్కులేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనంలో చూద్దాం..


Buggana-Minsiter.jpg

ఇదీ అసలు కథ..

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు సామాన్యుడి మొదలుకుని సామాన్యుడు, సెలబ్రిటీ వరకూ అందరికీ చిక్కులే.! ఇక ఎవరైనా సరే ప్రభుత్వాన్ని టచ్ చేసినా, ప్రశ్నించినా.. అంతకుమించి విమర్శించినా సరే.. వాళ్లను వెతికిమరీ పట్టుకుని జైలుకు తీసుకెళ్తోంది పోలీసు యంత్రాంగం. ప్రభుత్వం చెప్పినట్లే పోలీసులు తూ.చ తప్పుకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రశ్నించినది టీడీపీ పార్టీ చెందిన వ్యక్తి అయ్యుంటో మాత్రం అంతే సంగతులు.!. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుగాను టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంతమంది జైలుకెళ్లొచ్చారో లెక్కే లేకుండా పోయింది. ఈ క్రమంలో అసలు ప్రశ్నించకూడదు..? ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు..? అభివృద్ధిని ప్రశ్నిస్తే చాలు.. ఇకపై జైలుకు తీసుకెళ్లడం కాదు.. మరో కొత్త ఆలోచన చేసిందట సర్కార్. ఇది కొత్త అనడం కంటే చెత్త అంటే సరిగ్గా సెట్ అవుతుందేమో. ఏపీలో అభివృద్ధి ఎక్కడుందని ప్రశ్నించే వారిపై ఆదాయపన్ను విధిస్తే ఇక మాట్లాడరని స్వయానా ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడటం దారుణాతి దారుణం. చూశారుగా.. జగన్ సర్కార్ పరిస్థితి మరీ ఎంతలా దిగజారిందో తెలుసుకోవడానికి ఈ ఒక్క మాట చాలేమో.!

Chiru-And-Pawan.jpg

ఎందుకిలా..?

ఈ మధ్య ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలే కాదు.. సామాన్యుడు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, సంబంధిత మంత్రి లేదా డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేయడం మామూలైపోయింది. అలా విమర్శిస్తే చాలు మరుక్షణమే వైసీపీ బ్యాచ్ (YSRCP Batch) రంగంలోకి దిగిపోయి విమర్శలు చేసేయడం షరామూలైపోయింది. ఈ మధ్య ప్రభుత్వాన్ని విమర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Janasena Chief Pawan Kalyan) .. మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) ఏ రేంజ్‌లో వైసీపీ వీరాభిమానులు (YSRCP Fans) ఆడుకున్నారో.. ఎంతలా అక్కసు వెళ్లగక్కారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇలా ప్రశ్నించడం ఎక్కువైందని ఆర్థిక మంత్రి అనుకున్నారేమో గానీ.. ప్రశ్నిస్తే చాలు ఆదాయపన్ను విధించాలని.. ఆ తర్వాత ఎవరూ నోరు తెరవరని బుగ్గన సెలవివ్వడం సిగ్గుచేటు. గురువారం నాడు ఆదోని, ఆలూరు నియోజకవర్గాల అధికారులతో బుగ్గన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్ను గురించి మాట్లాడారు. ‘ఊరికే మైక్ ఉంది కదా అని ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని అంటున్నారు. ఇలాంటి వారికి ఆదాయపన్ను విధించేలా చేస్తే మరోసారి ఇలా మాట్లాడరు’ అని చెప్పుకొచ్చారు.

Jagan-And-Buggana.jpg

మొత్తానికి చూస్తే.. సో మంత్రి సెలవిచ్చిన దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందనిగానీ..? ఏమిటీ నిర్ణయాలు అని కానీ.. అభివృద్ధి గురించి రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదన్న మాట. ఆఖరికి మీడియా కూడా ప్రశ్నించకూడదన్నది మంత్రి భావనేమో. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నా.. ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదన్న మాట. బుగ్గన కామెంట్స్ చూసిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ‘ సిగ్గో సిగ్గు..’ అని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించిన పరిస్థితి. పోనీ.. ఈ కామెంట్స్ విన్న తర్వాత జగన్‌గానీ.. ఆ పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా దీనిపై మాట్లాడటానికి సాహసించట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

buggana.jpg


ఇవి కూడా చదవండి


-AP Debts : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఏమయ్యారు.. ఎందుకీ మౌనవ్రతం..!?


AP Politics : వైసీపీకి బాలినేని శ్రీనివాస్ నిజంగానే గుడ్ బై చెబుతున్నారా..!?


YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?


TS Assembly Election 2023 : ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన కాంగ్రెస్.. ఇక అస్త్రాలు ప్రయోగించడమే ఆలస్యం.. ఈ దెబ్బతో..!



Updated Date - 2023-08-11T21:07:04+05:30 IST