ఆసక్తికరంగా మారిన పలాస పాలిటిక్స్‌.. వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలుస్తున్న పలాస ఫైర్‌బ్రాండ్‌

ABN , First Publish Date - 2023-02-17T11:03:20+05:30 IST

చతురత, చాణక్యం ఉన్న నేతలు రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా గట్టిగా

ఆసక్తికరంగా మారిన పలాస పాలిటిక్స్‌.. వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలుస్తున్న పలాస ఫైర్‌బ్రాండ్‌

రాజకీయాల్లోకి రాకముందు ఆమె తండ్రిచాటు బిడ్డ.. కానీ.. 2019 ఎన్నికల్లో ఎంట్రీ తర్వాత ఓ ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ కేసులను సైతం ఎదుర్కొన్నారు. వైసీపీ అరాచకాలపై ఓ రేంజ్‌లో ఫైట్‌ చేశారు. కానీ.. ఆ మహిళా నేత.. కొంతకాలంగా మౌనం దాల్చాడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఇంతకీ.. ఎవరా మహిళా నేత?.. ఆమె మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-3544.jpg

విమర్శలు, సోషల్‌ మీడియా పోస్టింగులపై కేసులు

చతురత, చాణక్యం ఉన్న నేతలు రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా గట్టిగా నిలబడ్డవారు రాజకీయాల్లో రాటుదేలుతారు. దానికి తగ్గట్లే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన చాలామంది నేతలు సమస్యలకు ఎదురొడ్డి నిలబడుతున్నారనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిని, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవారిని.. సీఐడీ కేసులు పెట్టి వేధిస్తోంది. అలాంటి తరుణంలో కొంతమంది నేతలు.. కేసులకు భయపడకుండా జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతల గురించి ప్రత్యేకించి చెప్పుకోవచ్చు.

Untitled-654.jpg

గౌతు కుటుంబానికి పలాసలో మంచి పట్టు

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతూనే ఉంటాయి. మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాసలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా గౌతు శిరీష ఉన్నారు. అయితే.. గౌతు కుటుంబానికి ఆ ప్రాంతంలో మంచి పట్టుంది. గౌతు శ్యాంసుందర్ శివాజీ టీడీపీ ఆవిర్భావం నుంచి.. పలాసలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. శివాజీ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన శిరీష.. ఆది నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి అప్పలరాజుతో నువ్వా నేనా అన్నట్టు శిరీష పోరాటం చేస్తున్నారు. ప్రతికూల పరిస్ధితులను అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా.. అతి తక్కువ కాలంలో టీడీపీలో ఫైర్‌బ్రాండ్ మహిళగా పేరు తెచ్చుకున్నారు.

Untitled-554.jpg

ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారనే చర్చ

ఇదిలావుంటే.. టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శిరీష.. గత కొంతకాలంగా మౌనం వహిస్తుండడం ఆసక్తి రేపుతోంది. నిత్యం టీవీ డిబేట్లు, ప్రెస్‌మీట్లు, ధర్నాలు, రాస్తారోకోలతో జగన్‌ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడిన శిరీష.. ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారన్న చర్చ రాజకీయా వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత శిరీష వైసీపీ కుట్ర రాజకీయాలపై గట్టిగానే పోరాడారు. మంత్రి అప్పలరాజుకు మహిళల సత్తా ఏంటో గట్టిగానే రుచి చూపించారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎందుకు సైలెంట్ అయ్యారనే దానిపై పలాసలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. శిరీష మౌనం వ్యూహాత్మకమే అంటున్నారు గౌతు అభిమానులు.

Untitled-454.jpg

టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ సొంత నేతలే అల్టిమేటం

వాస్తవానికి.. మంత్రి అప్పలరాజుపై సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున అసమ్మతి చెలరేగుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు జోరందుకున్నాయి. అదీ సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేయడం తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. అప్పలరాజుకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ సొంత పార్టీ నేతలే అల్టిమేటం జారీ చేస్తున్నారు. దాంతో.. కొద్దిరోజులు సైలెంట్‌గా ఉండడమే మంచిదని శిరీష భావిస్తున్నట్లు స్థానిక టీడీపీ నేతలు చెప్తున్నారు. పలాస వైసీపీలో రేగిన అసమ్మతి మంటలు.. ఎలాగూ టీడీపీ అనుకూలంగా మారుతాయన్న భావనలో గౌతు శిరీష ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ వైసీపీ అంతర్గత కుమ్ములాటలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డ అప్పలరాజు ఇప్పుడు చేతులెత్తేసారు. ఆయా పరిస్థితులను గమనిస్తున్న శిరీష.. పలాస వైసీపీ అసమ్మతి నేతలు లేవనెత్తుతున్న అంశాలనే ఎన్నికల ముందు ప్రజల్లో ఉంచాలని భావిస్తున్నారు.

Untitled-74.jpg

టీడీపీలోని యాక్టివ్ మహిళా నేతల్లో ఒకరిగా పేరు

మొత్తంగా.. పలాస పాలిటిక్స్‌ ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ కుమ్ములాటలే టీడీపీ నేతలు అస్త్రాలుగా వాడుకోబోతున్నారు. ప్రస్తుతం పలాస టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న గౌతు శిరీష.. ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ క్రమంలో.. తాత గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చేస్తామంటూ మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలతో శిరీష తనలోని నాయకత్వ లక్షణాలను బయట పెట్టారు. టీడీపీలో ఉన్న అతికొద్దిమంది యాక్టివ్ మహిళా నేతలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి శిరీష ఇప్పుడు మౌనంగా ఉండడం పలాసలో హాట్‌టాపిక్‌ అవుతోంది. అయితే.. సమయం చూసి దెబ్బకొట్టడం ఖాయమని అనుచరుల చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో పలాస పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో చూడాలి మరి.

Untitled-154.jpg

Updated Date - 2023-02-17T11:28:20+05:30 IST