Jagan Politics: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు చెక్.. మాట మాత్రం చెప్పుకుండా..

ABN , First Publish Date - 2023-05-11T12:20:11+05:30 IST

ఎట్టకేలకు వైసీపీ అధిష్ఠానం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. అధిష్ఠానం తీరుతో కొంతకాలంగా ఆర్కే తన నియోజకవర్గ పరిధిలోనే ఉన్న తాడేపల్లి ప్యాలెస్‌ మొఖం చూసేందుకు కూడా ఇష్టపడకపోవటమే కాకుండా పార్టీ సూచించిన కార్యక్రమాలను కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే.

Jagan Politics: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు చెక్.. మాట మాత్రం చెప్పుకుండా..

ప్రధాన ప్రత్యర్ధికి కీలక పదవి

అమెరికా పర్యటనలో ఉండగా మాట మాత్రం చెప్పకుండా కీలక నిర్ణయం

మంగళగిరి, తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడుగా వేమారెడ్డి నియామకం

ఇప్పటి వరకు ఆ రెండు పట్టణాల అధ్యక్షులుగా ఉన్న ఆర్కే వర్గంపై వేటు

రాత్రికి రాత్రే అధిష్ఠానం నిర్ణయంతో ఆర్కే వర్గం ఉలికిపాటు

పొమ్మనకుండా పొగపెట్టాశారంటూ ఆక్రోశం

గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు వైసీపీ అధిష్ఠానం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. అధిష్ఠానం తీరుతో కొంతకాలంగా ఆర్కే తన నియో జకవర్గ పరిధిలోనే ఉన్న తాడేపల్లి ప్యాలెస్‌ మొఖం చూసేందుకు కూడా ఇష్టపడకపోవటమే కాకుండా పార్టీ సూచించిన కార్యక్రమాలను కూడా బహిష్క రించిన విషయం తెలిసిందే. చంద్రబాబు తనయుడు అప్పటి మంత్రి లోకేష్‌పై విజయం సాధించిన ఆర్కే తనకు జగన్‌ కేబినెట్‌లో తప్పనిసరిగా చోటు లభిస్తుందని ఆశించారు. అయితే ఆయనకు తొలి విడత కానీ విస్తరణలో కానీ అవకాశం దక్కలేదు. మంత్రి పదవి ఇవ్వకపోగా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపులో కూడా వివక్ష చూపారనే నెపంతో ఆయన జగన్‌కు దూరంగా ఉంటూ వస్తు న్నారు. దీంతో వారిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించవలంసిందిగా సూచిం చినా పార్టీ ముఖ్యుల వద్ద కూడా ఆర్కే ఎంతో నిష్టూ రంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఏం ముఖం పెట్టుకొని జనం ముందుకు వెళ్ళాలంటూ ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని బహిష్కరించటం జరిగింది. దీంతో ఆర్కేను పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

alla-ramakrishna-reddy.jpg

నియోజకవర్గంలో సగ భాగానికి పైగా ఉండే మంగళగిరి, తాడేపల్లి ఉమ్మడి నగర పార్టీ అధ్యక్షుడుగా తాడేపల్లికి చెందిన మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డిని నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వేమారెడ్డికి ఆర్కేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. మంగళగిరి సీటును ఆశించిన వేమారెడ్డి అది దక్కకపోవటంతో రెండో పర్యాయం టిక్కెట్‌ దక్కించుకున్న ఆర్కేపై కత్తి కట్టారని, అదే విధంగా ఆర్కే కూడా తనకు సీటు రాకుండా చేయాలని ప్రయత్నించాడని వేమారెడ్డిపై కక్ష పెంచుకొన్నారనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించిలేదని కూడా అప్పట్లో ఆర్కే అధిష్ఠానానికి ఫిర్యాదు చేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్కే అమెరికా పర్యటనలో ఉండగా అధిష్ఠానం రాత్రికి రాత్రి వేమారెడ్డికి కీలక పదవిని కట్టబెట్టారు.

1allaramakrishnareddy.jpg

వేమారెడ్డిని నియమించటం ఒక ఎత్తయితే ఇప్పటి వరకు మంగళగిరి పట్టణపార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్న మునగాల మల్లేశ్వరరావును, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులుగా ఉన్న బుర్ర ముక్కు వేణు గోపాలస్వా మిరెడ్డిలను పదవుల నుంచి త ప్పించేశారు. వీరిద్దరు కూడా ఎమ్మెల్యే ఆర్కేకు విధేయులు, ఆర్కే స్థానికంగా లేని సమయం లో ఆయన ప్రత్యర్ధికి పెద్దపీట వేయటం తద్వారా ఆర్కే విధేయుల పదవులకు ఎసరు పెట్టటంతో ఆర్కే వర్గీయులు ఉలికిపాటుకు గురయ్యారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ వైసీపీలో పెను తుఫాను ఏర్పడింది. చివరకు ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో ఆర్కే అమెరికా పర్యటన నుంచి వచ్చిన తరువాత తేలనున్నది.

Updated Date - 2023-05-11T12:20:20+05:30 IST