Amala Paul : సినీనటి అమలాపాల్‌కు పరాభవం..

ABN , First Publish Date - 2023-01-18T07:27:33+05:30 IST

ప్రముఖ సినీనటి అమలాపాల్‌కు ఘోర పరాభవం జరిగింది....

Amala Paul : సినీనటి అమలాపాల్‌కు పరాభవం..
Amala Paul entry denied at temple

తిరువనంతపురం(కేరళ): ప్రముఖ సినీనటి అమలాపాల్‌కు ఘోర పరాభవం జరిగింది.(Actor Amala Paul) కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి(Thiruvairanikulam Mahadeva temple) ప్రవేశించడానికి అధికారులు తనకు అనుమతి నిరాకరించారని నటి అమలా పాల్ ఆరోపించారు.(Entry denied at Kerala temple)తిరువైరానికులం మహాదేవ ఆలయ అధికారులు హిందూ భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఆచారాలను మాత్రమే అనుసరిస్తున్నందున నటికి ప్రవేశం నిరాకరించారు.తనకు ఆలయ దర్శనం నిరాకరించారని, ఆలయం ముందు ఉన్న అమ్మవారి దర్శనం చేసుకోమని తనను బలవంతం చేశారని అమలాపాల్ పేర్కొన్నారు.ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో అమలా పాల్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

‘‘నేను అమ్మవారిని చూడ లేకపోయినా ఆత్మను అనుభవించాను’’ అని అమలాపాల్ పేర్కొన్నారు.‘‘2023వ సంవత్సరంలో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం, ఈ విషయం నన్ను నిరాశపరిచింది. నేను దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను, కానీ దూరం నుంచి ఆత్మను ప్రార్థించాను. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. సమయం వస్తుంది మనమందరం మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూస్తారు’’ అని అమలా పాల్ ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో రాశారు.ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తిరువైరానికుళం మహాదేవ ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలోని ఆలయ నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు.

Updated Date - 2023-01-18T07:32:42+05:30 IST