Funny Viral Video: హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చిన గజరాజు.. లారీని ఆపి ఏం చేసిందో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-03-08T19:38:37+05:30 IST

ఓ ఏనుగుకు సంబంధించిన ఆశ్చర్యకర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఏనుగులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో దొరకవు.

Funny Viral Video: హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చిన గజరాజు.. లారీని ఆపి ఏం చేసిందో చూస్తే షాకవ్వాల్సిందే..

ఓ ఏనుగుకు (Elephant) సంబంధించిన ఆశ్చర్యకర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. సాధారణంగా ఏనుగులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో దొరకవు. అయితే ఈ వీడియో మాత్రం గజరాజులోని మరో కోణాన్ని పరిచయం చేసింది. @DoctorAjayita అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (Funny Viral Video).

వైరల్ అవుతున్న ఈ వీడియోలో హైవే పక్కన ఓ ఏనుగు నిల్చుని ఉంది. అంతలో అటువైపుగా ఓ చెరుకు (Sugarcane) లారీ వెళ్తోంది. ఆ లారీని చూసిన ఏనుగు రోడ్డుపైకి వచ్చి లారీకి అడ్డుగా నిలబడింది. దీంతో లారీ ఆగింది. వెంటనే ఏనుగు పక్కకి జరిగి లారీలో ఉన్న చెరుకు ముక్కలను తీసుకుని ఆరగించింది (Elephant grabs Sugarcrane from truck). వెంటనే లారీ ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ.. సైన్ బోర్డులను బట్టి అది థాయ్‌లాండ్ అని తెలుస్తోంది. కాగా, ఆ వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్ ``టోల్ ట్యాక్స్ కలెక్టర్`` అని కామెంట్ చేశారు. ఈ ఫన్నీ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Magic Trick Video: మ్యాజిక్ చేస్తోంటే అంతా కళ్లప్పగించి చూశారు.. కానీ ఒక్కడు మాత్రం బండారం బయటపెట్టేశాడు..!

Updated Date - 2023-03-08T19:38:37+05:30 IST