Jr NTR: థ్యాంక్యూ సో మచ్ మావయ్యా..

ABN , First Publish Date - 2023-01-11T16:41:32+05:30 IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం గ్లోబల్ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్రపంచ వేదికపై..

Jr NTR: థ్యాంక్యూ సో మచ్ మావయ్యా..

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం గ్లోబల్ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటునాటు’ (NaatuNaatu) పాటకి అరుదైన గౌరవం దక్కింది. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో (Golden Globe Awards) బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్ ఫిల్మ్ ఇన్‌ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజెస్‌లో నామినేట్‌ అయింది ట్రిపుల్‌ ఆర్‌ సినిమా. నాటు నాటు సాంగ్‌కి గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డుల్లో బెస్ట్ఒరిజినల్‌ సాంగ్‌ పురస్కారం దక్కింది. దీంతో ఇండియా వైడ్‌గా ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ఏపీ సీఎం జగన్ ‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)‌తో పాటు పలువురు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

అయితే అభినందనలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్ ‌మోహన్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్స్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు అంటూ రిప్లయ్ ఇచ్చారు. ప్రధాని ట్వీట్‌కు ‘థ్యాంక్యూ సార్.. చాలా గౌరవంగా ఉంది’ అని, సీఎం జగన్ ట్వీట్‌కు ‘థ్యాంక్యూ సార్’ అని, చంద్రబాబు ట్వీట్‌కు ‘థ్యాంక్యూ సో మచ్ మావయ్యా..’ (Thank you so much mavayya) అని ఎన్టీఆర్ రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రిప్లయ్ ఇస్తూ చేసిన ట్వీట్స్, అందులో ముఖ్యంగా ‘థ్యాంక్యూ సో మచ్ మావయ్యా..’ అనే ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. కాగా, చంద్రబాబు ట్వీట్‌కి ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లయ్‌‌పై మరో నందమూరి హీరో తారకరత్న కూడా స్పందించారు. ‘మై బ్రదర్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Updated Date - 2023-01-11T18:21:51+05:30 IST