Share News

Lipsticks: రూ.300 లిప్‌స్టిక్‌ను ఆర్డర్ పెట్టిందో యువతి.. డెలివరీ కాకుండానే రూ.లక్ష మాయం.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-11-21T12:37:44+05:30 IST

ఓ లేడీ డాక్టర్ కూడా ఈ-కామర్స్ సైట్లో రూ.300 విలువైన లిప్టిక్ ఆర్టర్ చేసింది. కానీ ఆ ఆర్డర్ డెలివరీ కాకుండానే జరిగిన పనికి..

Lipsticks: రూ.300  లిప్‌స్టిక్‌ను ఆర్డర్ పెట్టిందో యువతి.. డెలివరీ కాకుండానే రూ.లక్ష మాయం.. అసలేం జరిగిందంటే..!

ప్రతి చిన్న కొనుగోలుకు ఈ-కామర్స్ సైట్ల మీద ఆధారపడుతున్న కాలమిది. వీధుల వెంట, షాపుల చుట్టూ తిరగక్కర్లేకుండా కావాలనుకున్న వస్తువును ఆర్టర్ పెడితే చాలు. లక్షణంగా డోర్ డెలివరీ ఇచ్చేలా కొరియర్ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నాయి ఈ-కామర్స్ సైట్లు. ఓ లేడీ డాక్టర్ కూడా ఇలాగే ఈ-కామర్స్ సైట్లో రూ.300 విలువైన లిప్టిక్ ఆర్టర్ చేసింది. కానీ ఆ ఆర్డర్ డెలివరీ కాకుండానే ఆమె ఖాతానుండి రూ.లక్ష మాయమైంది. అందరినీ విస్తుపోయేలా చేస్తున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈ-కామర్స్ సైట్లు ప్రజలకు షాపింగ్ కష్టాన్ని తగ్గించాయనే చెప్పవచ్చు. చిన్న చిన్న వస్తువులను కూడా డెలివరీ చేస్తుండటంతో చాలామంది బయట షాపులకు కూడా వెళ్ళకుండా ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తారు. ఇక హడావిడి ఉద్యోగాలు చేసేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై(Mumbai)లో నివసిస్తున్న ఓ లేడీ డాక్టర్(Lady doctor) ఈ-కామర్స్ సైట్లో రూ.300 విలువైన లిప్టిక్ ఆర్టర్ పెట్టింది. ఒకరోజు కొరియర్ కంపెనీ నుండి ఆమె ఆర్డర్ డెలివరీ అయ్యిందంటూ ఆమెకు మెసేజ్ వచ్చింది. అయితే ఆమె ఆర్డర్ మాత్రం అందుకోలేదు. దీంతో ఆమె తనకు వచ్చిన కొరియర్ మెసేజ్ లో పొందుపరిచిన కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేసి తనకు ఆర్డర్ డెలివరీ కాలేదని చెప్పింది. ఆమె సమస్యను విన్న కొరియర్ వారు కొన్ని నిమిషాల తరువాత ఆమెను సంప్రదిస్తామని చెప్పి కాల్ కట్ చేశారు. అనంతరం కొన్ని నిమిషాల తరువాత ఆమెకు కొరియర్ వారు కాల్ చేసి ఆర్డర్ హోల్ట్ లో ఉందని, ఆర్డర్ డెలివరీ కావాలంటే రూ.2 చెల్లించాలని చెప్పారు. రూ.2 మాత్రమే డిమాండ్ చేయడంతో ఆమె ఆ డబ్బు చెల్లించడానికి సిద్దపడింది. డబ్బు చెల్లించడం కోసం కొరియర్ వారు ఆమెకు ఒక వెబ్ లింక్ పంపారు. ఆమె ఆ వెబ్ లింక్ ఓపెన్ చేయగా అది మొబైల్ లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ కు దారితీసింది. అందులో బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరచాలని వచ్చిన దశలు పూర్తీ చేసి మరీ రూ.2 చెల్లించింది.

ఇది కూడా చదవండి: ఇళ్లల్లో మనీ ప్లాంట్‌ పెంపకం.. చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే..!


మహిళా వైద్యురాలు రూ.2 చెల్లించిన తరువాత ఆమె బ్యాంకు ఖాతాలో రూ.95వేలు ఒకసారి, రూ 5వేలు మరొక సారి కట్ అయినట్టు ఆమెకు బ్యాంకు నుండి నోటిఫికేషన్లు వచ్చాయి. అవి చూడగానే ఆమె కంగు తినింది. వెంటనే సైబర్ పోలిస్ స్టేషన్లో తనకు జరిగిన మోసం గురించి ఫిర్యాదు చేసింది. స్కామర్లు కొరియర్ సర్వీస్ సిబ్బంది పేరుతో ఆ మహిళా వైద్యురాలిని మోసగించారని పోలీసులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో స్కామర్లు కొత్త కొత్త మార్గాలలో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చదువుకున్న వారు చదువులేని వారు అనే తేడా లేకుండా స్కామర్ల చేతిలో మోసపోతున్నారని అన్నారు. ఈ-కామర్స్ వెబ్సైట్లు చాలా వరకు హెల్ప్ లైన్ నెంబర్ ను ఇస్తుంటాయి కాబట్టి కొరియర్ సర్వీస్ గురించి ఏ సందేహాలున్నా హెల్పైన్ సిబ్బందిని సంప్రదించాలని సైబర్ పోలీసులు ప్రజలను సూచించారు. చట్టబద్దమైన కంపెనీలు ఏవీ ఆర్జిక సంబంధ అకౌంట్లు, వివరాలు మెసేజుల్లోనూ, ఫోన్లలోనూ అడగవని తెలిపారు. నకిలీ వెబ్సైట్లను చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడాచదవండి: Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీళ్లను తాగుతున్నారా..? అదే పనిగా తాగితే ఏం జరుగుతుందంటే..!

Updated Date - 2023-11-21T12:37:47+05:30 IST