హోలీ అంటే తెలియకపోతే ఆ ఇమోజీ పెట్టేస్తారా?.. మాజీ ప్రధానిపై విమర్శల వర్షం!

ABN , First Publish Date - 2023-03-09T11:52:31+05:30 IST

nawaz sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హోలీ సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు(Greetings) తెలిపారు, అయితే ఈ సందేశంతో షరీఫ్ చేసిన పనికి ట్విట్టర్ వినియోగదారులు అతన్ని విపరీతంగా ట్రోల్(troll) చేస్తున్నారు.

హోలీ అంటే తెలియకపోతే ఆ ఇమోజీ పెట్టేస్తారా?.. మాజీ ప్రధానిపై విమర్శల వర్షం!

nawaz sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హోలీ సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు(Greetings) తెలిపారు, అయితే ఈ సందేశంతో షరీఫ్ చేసిన పనికి ట్విట్టర్ వినియోగదారులు అతన్ని విపరీతంగా ట్రోల్(troll) చేస్తున్నారు. నవాజ్ షరీఫ్ గతంలో భారత్‌(India)తో సంబంధాలను మెరుగుపరచడంలో పేరుగాంచారు. షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉంటూ అనారోగ్యానికి చికిత్స(treatment) పొందుతున్నారు, షరీఫ్ భారతీయులకు హోలీ శుభాకాంక్షలు తెలిపే వరకు అంతా బాగానే ఉన్నా, దానికి దీపావళి(Diwali)ని ప్రతిబింబించే ఇమోజీ షేర్ చేశారు.

ఇది చూసిన సోషల్ మీడియా(Social media) యూజర్స్ నవాజ్ షరీఫ్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ట్రోలర్లు హోలీ, దీపావళి పండుగల మధ్య తేడాను అర్థం చేసుకోవాలని షరీఫ్‌కు సూచించారు. 1,097 మందికి పైగా నెటిజన్లు రీట్వీట్ చేశారు. ఒక యూజర్.. ‘దీపం అనేది దీపావళికి చిహ్నం.. హోలీకి కాదు’ అని పేర్కొన్నారు. మరొక యూజర్.. దీపం అనేక రంగులలో (హోలీ) వెలిగిపోతుందని రాశారు.

adddd-1.jpg

ఇదిలా ఉండగా నవాజ్ షరీఫ్ మరో విషయంలోనూ ట్రోలర్స్(trollers) బారిన పడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం(Financial crisis)లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పాకిస్తాన్(Pakistan) పొరుగు దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ షరీఫ్ విలాసవంతమైన జీవితం గడపడానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో షరీఫ్ రోల్స్ రాయిస్ కారు(Rolls Royce car)లో లండన్‌లోని లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ దుకాణానికి చేరుకోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించగానే నెటిజన్లు ట్విట్టర్‌లో షరీఫ్‌ను విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలతో పాటు ట్విట్టర్ యూజర్స్ మాజీ ప్రధాని పర్యటనపై పండిపడ్డారు.

ఈ వీడియో లండన్‌కు చెందినదని ప్రతిపక్ష నేత ఫవాద్ హుస్సేన్(Fawad Hussain) పేర్కొన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత బాండ్ స్ట్రీట్‌లోని ఖరీదైన షాపింగ్ మాల్‌లో నవాజ్ షరీఫ్ షాపింగ్ చేసినట్లు ఫవాద్ హుస్సేన్ ఒక ట్వీట్‌లో తెలిపారు. నవాజ్‌ షరీఫ్ వ్యవహారం పాక్‌ న్యాయవ్యవస్థ(Judiciary)ను అవమానించేదిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ "నవాజ్ షరీఫ్ హాఫ్ మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 30 కోట్లు) విలువైన రోల్స్ రాయిస్ కారులో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ లూయిస్ విట్టన్‌(Louis Vuitton)లో షాపింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ విధ్వంసానికి ఆయనే కారణం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-09T12:01:15+05:30 IST