Pig kidney: మానవుడికి పంది కిడ్నీ.. సక్సెస్ అయిన ప్రయోగం
ABN , First Publish Date - 2023-09-15T16:02:55+05:30 IST
మనిషికి పంది కిడ్నీ(Pig Kidney) అమర్చిన ప్రయోగం సక్సెస్ కావడంతో వైద్య రంగంలో కొత్త చరిత్ర లిఖితమైంది. పంది కిడ్నీ గతంలోకన్నా ఎక్కువ రోజులు రెండు నెలలపాటు విజయవంతంగా ఒక మనిషి శరీరంలో పని చేయడంతో అవయవాల కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ల ప్రయత్నాలకు ఈ ప్రయోగం కొత్త ఊపిరిలూదింది.
న్యూయార్క్: మనిషికి పంది కిడ్నీ(Pig Kidney) అమర్చిన ప్రయోగం సక్సెస్ కావడంతో వైద్య రంగంలో కొత్త చరిత్ర లిఖితమైంది. పంది కిడ్నీ గతంలోకన్నా ఎక్కువ రోజులు రెండు నెలలపాటు విజయవంతంగా ఒక మనిషి శరీరంలో పని చేయడంతో అవయవాల కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ల ప్రయత్నాలకు ఈ ప్రయోగం కొత్త ఊపిరిలూదింది. యూఎస్(US) లో రెండు నెలల క్రితం బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ అనే వ్యక్తికి జులై 14న జన్యుమార్పిడి చేసి విజయవంతంగా పంది(Pig) కిడ్నీ అమర్చారు. ఈ ప్రయోగంలో ఆ కిడ్నీ ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి వ్యక్తి శరీరాన్ని వెంటిలేటర్(Ventilator)పై రెండు నెలల పాటు ఉంచారు.
అది సక్సెస్ ఫుల్ గా పని చేసింది. క్యాన్సర్(Cancer) కారణంగా అవయవాల దానం చేయలేకపోయిన ఆ వ్యక్తి డెడ్ బాడీ నుంచి పంది కిడ్నీని తీసేసి శరీరాన్ని డాక్టర్లు వారి కుటుంబానికి అప్పగించారు. ఈ ప్రయోగం సక్సెస్ తో బతికి ఉన్న మనుషుల్లోనూ పంది కిడ్నీ అమర్చవచ్చని హర్షం వ్యక్తం చేస్తూ సంబంధిత వివరాలను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(America Food and Drug Administration) ఆఫీసర్లతో పంచుకోనున్నారు. మానవ శరీరంలో జంతువుల అవయవాలు అమర్చితే ఆ ప్రయోగాలు విఫలమయ్యేవి. అయితే జంతువుల ఆర్గాన్స్(Organs)ని జన్యుమార్పిడి చేయడం ద్వారా మనుషుల అవయవాల్లాగే పని చేస్తాయని తేలింది. ఈ ఫలితాలు రానున్న రోజుల్లో వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.