RC15: ఇరవయి ఏళ్ల తరువాత కర్నూలు కి... అప్పుడు ఇప్పుడు చూసారా...

ABN , First Publish Date - 2023-02-09T14:46:25+05:30 IST

అభిమాని కుటుంబానికి సహాయం చెయ్యడానికి అప్పట్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun) కర్నూల్ (Kurnool) వెళ్లి ఆ కుటుంబానికి సహాయం చేసారు. ఇది జరిగినది 2002 సంవత్సరంలో, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తరువాత, రామ్ చరణ్ (#RC15) మళ్ళీ కర్నూల్ వెళుతున్నాడు.

RC15: ఇరవయి ఏళ్ల తరువాత కర్నూలు కి...  అప్పుడు ఇప్పుడు చూసారా...

కొన్ని రోజుల నుండి సాంఘీక మాధ్యమాల్లో నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) మీద బాగా ఒత్తిడి వచ్చేటట్టు చేస్తున్నారు. దిల్ రాజు ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్, రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Director Shankar) ల కాంబినేషన్ లో సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఆ సినిమాలో రామ్ చరణ్ లుక్ కావాలని సాంఘీక మాధ్యమాల్లో రామ్ చరణ్ అభిమానులు తీవ్రంగా దిల్ రాజు మీద ఒత్తిడి తెస్తున్నారు. దానితో నిర్మాత దిల్ రాజు మార్చ్ 27 (March 27) న రామ్ చరణ్ (#RC15) లుక్ విడుదల చేయవచ్చు అని ఒక వార్త కూడా వైరల్ అయింది. (#RC15)

RC3.jpg

అయితే అదే సమయం లో రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమా చూడటానికి అతని అభిమాని ఒకరు థియేటర్ వచ్చి విద్యుత్ ఘాతానికి బలి అయ్యారు. ఆ కుటుంబానికి సహాయం చెయ్యడానికి అప్పట్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun) కర్నూల్ (Kurnool) వెళ్లి ఆ కుటుంబానికి సహాయం చేసారు. ఇది జరిగినది 2002 సంవత్సరంలో, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తరువాత, రామ్ చరణ్ (#RC15) మళ్ళీ కర్నూల్ వెళుతున్నాడు.

RC-AA.jpg

ఈసారి అతని సినిమా షూటింగ్ కోసం వెళుతున్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా సాంఘీక మాధ్యమాల్లో రామ్ చరణ్, అతని సినిమా, కర్నూల్ రావటం ఇవన్నీ అభిమానులు పాత ఫోటోస్ కూడా షేర్ చేస్తున్నారు.

RC2.jpg

ఇందులో కియారా అద్వానీ (Kiara Advani) కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. శంకర్ ఈ సినిమాని చాలా భారీగా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుంది అని, దాని కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టి తీస్తున్నట్టు కూడా చెపుతున్నారు.

Updated Date - 2023-02-09T14:46:27+05:30 IST