Share News

Success Story: ఒకప్పుడు విమానాశ్రయంలో స్వీపర్‌గా పనిచేసిన ఇతడే.. ఇప్పుడు 4 కంపెనీలకు బాస్.. కోట్లలో ఆస్తి..!

ABN , First Publish Date - 2023-11-28T18:46:46+05:30 IST

ఒకప్పుడు ఎయిర్‌పోర్టులో స్వీపర్‌గా చేసిన కుర్రాడు ఇప్పుడు భారీ టర్నోవర్ ఉన్న సంస్థలకు బాస్ అయ్యాడు.

Success Story: ఒకప్పుడు విమానాశ్రయంలో స్వీపర్‌గా పనిచేసిన ఇతడే.. ఇప్పుడు 4 కంపెనీలకు బాస్.. కోట్లలో ఆస్తి..!

ఇంటర్నెట్ డెస్క్: వైఫల్యాల్ని సహిస్తూ ముందడుగు వేసే తెగువ ఉంటే సక్సెస్ అదే వస్తుంది. ఇందుకు ఉదాహరణే అమీర్ కుతుబ్(Amir Qutub). ఒకప్పుడు విమానాశ్రయంలో స్వీపర్‌గా పనిచేసిన ఈ యువకుడు ఇప్పుడు విదేశాల్లో నాలుగు బ్రాంచీలున్న సంస్థకు అధిపతి! మొదట్లో 170 కంపెనీలు జాబ్ ఇవ్వబోమని అమీర్‌ను తిరస్కరిస్తే ఇప్పుడు అతడే స్వయంగా వందకు పైగా ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నాడు.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అసలు ఏఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి ఇస్తారంటే..!

ఉత్తర్‌ప్రదేశ్(Uttarpradesh) అలీఘడ్‌లోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అమీర్ కుతుబ్ 12వ తరగతి తరవాత అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేరాడు. ఎప్పటికైనా గొప్ప వ్యాపారవేత్త కావాలనేది అతడి కల. ఇదిలా ఉంటే, అతడికి చదువుపై అంతగా మనసు పోయేది కాదు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతడు ఢిల్లీలోని ఓ కంపెనీలో జాబ్‌లో చేరాడు. అది నచ్చక కొంత కాలానికే ఉద్యోగం మానేశాడు. ఆ తరువాత ఫ్రిలాన్స్ వెబ్ డిజైనర్‌గా కొంతకాలం పని చేశాడు. అప్పట్లో అమీర్‌కు ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా క్లైంట్లు ఉండేవారు. ఈ దశలోనే అతడు పైచదువుల కోసం ఆస్ట్రేలియాలో(Australia) వెళ్లాడు.

Indian Railway: చేతిలో ట్రైన్ టికెట్ ఉన్నా సరే.. ఈ మిస్టేక్ చేస్తే జరిమానా తప్పదు.. చాలా మందికి తెలియని రూల్..!


కానీ, అక్కడా అతడికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చదువు పూర్తయ్యాక నాలుగు నెలల్లో అతడు 170 కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించగా అందరూ అతడిని తిరస్కరించారు. ఉద్యోగానుభవం లేకపోవడం, ఇంగ్లీష్‌పై పట్టులేకపోవడం అతడికి ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో స్వీపర్‌గా (Airport sweeper) చేరిన అమీర్ తన ప్రయత్నాలను యథావిధిగా కొనసాగించాడు. ఈ క్రమంలో అదృష్టంకొద్దీ ఓ సంస్థలో అతడికి ఇంటర్న్‌షిప్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో అమీర్ ఆ తరువాత 15 రోజుల్లోనే ఆపరేషన్స్ విభాగం మేనేజర్‌గా పదోన్నతి అందుకున్నాడు. మరో రెండు సంవత్సరాలు తిరిగే సరికి అతడు ఇంటరిమ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు.

Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!

ఈ సమయంలోనే అతడు తన కలలకు రూపం ఇస్తూ ఎంటర్‌ప్రైజ్ మంకీ సంస్థను ప్రారంభించాడు. కేవలం 2 వేల డాలర్ల పెట్టుబడితో వ్యాపారంలోకి దిగాడు. అయితే, అమీర్ కష్టం ఫలించడంతో ఎంటర్‌ప్రైజ్ మంకీ (Enterprise monkey) చూస్తుండగానే గొప్ప అభివృద్ధి సాధించింది. ఆస్ట్రేలియాతో పాటూ మరో మూడు దేశాలకు విస్తరించింది. యాప్, వెబ్ డిజైనింగ్‌తో పాటూ సంస్థల ఉత్పాదకత పెంచే పలు ఉత్పత్తులను అందిస్తూ కస్టమర్ల నమ్మకం చూరగొన్న ఈ సంస్థలో ప్రస్తుతం వందకుపైగా ఉద్యోగులు, మరో 300 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తు్న్నారు. వైఫల్యాలు ఎదురవుతున్నా తన కలను మర్చిపోని అమీర్ చివరకు జీవితంలో ఆశించిన విజయాన్నే అందుకున్నాడు.

Viral: వైద్య పరీక్షలకు వెళ్లిన వృద్ధుడు..ఆయన పెద్ద పేగులో ఏముందో చూసిన డాక్టర్లకు దిమ్మతిరిగే షాక్!

Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!

Updated Date - 2023-11-28T18:46:49+05:30 IST