Viral video: ఇంత ధైర్యమేంటయ్యా బాబూ.. చెట్ల పొదల్లో దాక్కున్న కొండచిలువను ఒంటి చేత్తో బయటకు లాగితే..!
ABN , First Publish Date - 2023-08-25T13:51:19+05:30 IST
చూస్తేనే జడుసుకునేవారు ఉంటారు. కానీ ఓ వ్యక్తి చీకట్లో, చెట్ల పొదల్లో దాక్కున్న పెద్ద కొండచిలువను ఒంటిచేత్తో బయటకు లాగేశాడు. ఆ తరువాత జరిగిన సంఘటన చూస్తే..
మనుషులను భయపెట్టే ప్రాణులలో పాములు కూడా ఒకటి. వీటిలో విషం ఉన్నవి, విషంలేనివి అంటూ వర్గాలు ఉన్నాయి. విషం లేకపోయినా వాటి బలంతో మనుషుల్ని చంపేవి కొండచిలువలు. ఓ మోస్తరు కొండచిలువలు ఏకంగా గొర్రెలను, చిన్న పిల్లలను మింగేస్తే పెద్ద కొండచిలువలు మనుషుల్ని మింగేస్తుంటాయి. అందుకే ఇవి విషపూరితం కాకపోయినా ప్రమాదకరమైనవిగా పరిగణింపబడతాయి. వీటిని చూస్తేనే జడుసుకునేవారు ఉంటారు. కానీ ఓ వ్యక్తి చీకట్లో, చెట్ల పొదల్లో దాక్కున్న పెద్ద కొండచిలువను ఒంటిచేత్తో బయటకు లాగేశాడు. ఆ తరువాత జరిగిన సంఘటన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..
కొండచిలువలు(pythons) విషపూరితం కాకపోయినా వాటి బలంతో మనుషులను చుట్టేసి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేస్తాయి. వాటి బలం ముందు మనిషి పోరాడాల్సిందే. కానీ కొందరు వీటిని పట్టడానికి డేర్ చేస్తుంటారు. వీడియోలో ఓ కొండచిలువ చీకట్లో, చెట్ల పొదల్లో నక్కి ఉంది. కర్ణాటకకు(Karnataka) చెందిన స్నేక్ క్యాచర్ నవీన్ తన చెయ్యిని చెట్ల పొదల్లో దూర్చి ఒక్కసారిగా కొండచిలువను బయటకు లాగాడు(man drag a python with one hand). ఆ కొండ చిలువ పరిమాణం చూస్తే పక్కాగా షాకవడం ఖాయం. అతను దాన్ని పట్టుకున్నంత సేపు అది అతని కడుపు భాగాన్ని, ఆ తరువాత మెడను చుట్టేసి అతన్ని చంపేయాలని ప్రయత్నించడం చూడచ్చు. అది పదే పదే ప్రయత్నం చేస్తున్నా అతను తన నముడుకు, మెడకు చుట్టుకున్న కొండచిలువను సున్నితంగా చేతులతో విడిపించుకుంటాడు. చివరికి దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేయడంతో వీడియో ముగుస్తుంది.
Woman: స్నానం చేసి బాత్రూం నుంచి బయటికొచ్చిన వెంటనే చేసిన ఒక్క మిస్టేక్‌తో.. ఆ యువతి ప్రాణాలే పోయాయ్..!
ఈ వీడియోను snake_naveen అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొండ చిలువ పట్టిన వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని కొందరు సలహా ఇస్తుండగా, మరికొందరు అతని ధైర్యానికి అవాక్కవుతున్నారు. 'ఇంత భారీ కొండచిలువను పట్టుకోవడం నేను మొదటిసారి చూస్తున్నాను' అని ఒకరు కామెంట్ చేశారు. 'అరె భాయ్.. ఆ పాముకు చాలా చరిత్ర ఉంది. దాన్ని చూసి అంతా భయపడాలి. మీరు దాన్ని గౌరవించట్లేదు' అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.