Viral Video: ఈ పోకిరి విలన్ రుచులే వేరబ్బా.. రసగుల్లాను ఇలా తినడం మీరెప్పుడూ చూసుండరు..

ABN , First Publish Date - 2023-02-26T16:37:38+05:30 IST

అరుదైన ఫుడ్ పరిచయం చేసే ఆశిష్ కొత్త కాంబినేషన్ చూపించాడు

Viral Video:  ఈ పోకిరి విలన్ రుచులే వేరబ్బా.. రసగుల్లాను ఇలా తినడం మీరెప్పుడూ చూసుండరు..

పోకిరి సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా ఓ గొప్ప విలన్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది. విలన్ అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా హింసను పండించే ఈ విలన్ ఆశిష్ విద్యార్థి. ఇతను సినిమా తెర మీద విలన్ కావచ్చు కానీ సోషల్ మీడియోలో మాత్రం ఆహార ప్రియుడు. కలకత్తా, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఫుడ్ కోసం తిరుగుతూ చాలా సాధారణ వ్యక్తిలా రోడ్ సైడ్ బండి మీద కూడా ఛాయ్ తాగేయడం, వడా పావ్ తినడం ఆశిష్ కు చెల్లుతుంది. అరుదైన ఫుడ్ పరిచయం చేసే ఆశిష్ యూట్యూబ్ లోనూ ఇన్స్టాగ్రామ్ లోనూ లెక్కలేనన్ని వీడియోలు అప్లోడ్ చేశాడు. ఆ కోవలోకి చెందినదే రసగుల్లా ఛాయ్..

వినగానే ఉలిక్కిపడతారేమో కానీ ఆశిష్ విధ్యార్థి పరిచయం చేసిన ఈ రసగుల్లా ఛాయ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఛాయ్ కు భారతీయులకు మధ్య ఉన్న బాండింగ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోల్కతా వీధులలో ఓ టీకొట్టు వ్యక్తి అల్లం, పాలు, చక్కెర, టీ పొడి ఉపయోగించి టీ తయారు చేసి చివరగా మట్టి కప్పులో రసగుల్లా వేశాడు, ఆ రసగుల్లా కప్పులో నిండుగా టీ పోసి ఆ రసగుల్లా తినడానికి ఓ స్పూన్ ఇస్తున్నాడు.

Read also: Viral Video:బంజారాహిల్స్ లో బంగారు దోశ.. ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..


బెంగాలీస్ అంటే స్వీట్లు, స్వీట్లంటే బెంగాలీ అన్నట్టుండే కలకత్తా ప్రజలకు రసగుల్లా అంటే సహజంగా కూసింత మమకారం ఎక్కువ. అలాంటి రసగుల్లాను ఇలా టీ కాంబినేషన్ గా మార్చడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి ఫుడ్ వ్లోగ్స్ చెయ్యడం మీకు సరికాదంటూ కొందరు కామెంట్ చేశారు. షుగర్ సిరప్ లో జలకాలాడుతూ మన నోట్లో జారుకోవాల్సిన రసగుల్లా ఇలా టీతో దాని రూపమే మార్చుకోవడం కొందరికి నచ్చినట్టులేదు. అందుకే ఇది కొత్త వంటకం కాదు బుద్దిలేకుండా చేసిన వంటకం అని ఘాటుగానే విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-02-26T16:43:08+05:30 IST