Share News

Viral Video: ఇల్లు శుభ్రం చేస్తోంటే పైకప్పు నుండి వింత శబ్దాలు. అనుమానంగానే చేతులు పెట్టిన యువతికి దొరికిందేంటో చూస్తే..

ABN , First Publish Date - 2023-10-30T14:49:24+05:30 IST

ఒకటే వింత శబ్ధాలు వస్తోంటే అనుమానంగానే సీలింగ్ కు రంధ్రం చేసి చేతులు పెట్టింది. కానీ..

Viral Video: ఇల్లు శుభ్రం చేస్తోంటే పైకప్పు నుండి వింత శబ్దాలు.  అనుమానంగానే  చేతులు పెట్టిన యువతికి దొరికిందేంటో చూస్తే..

ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు ఇంట్లో ఏదో ఒక మూల బొద్దింకలు, బల్లులు లాంటివి వేగంగా పరిగెడుతూ కనిపిస్తాయి. వీటిని చూసి కొందరు మహిళలు గావుకేకలు పెట్టి మరీ భయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఓ యువతి ఇల్లు శుభ్రం చేస్తోంటే ఇంటి పైకప్పు నుండి వింత శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలేంటో అర్థం ఎవరికీ అర్థం కాలేదు. కానీ అదేంటో తెలుసుకోవాలని ఆమె రంగంలోకి దిగింది. పై కప్పుకి రంధ్రం చేసి అందులో చేతులు పెట్టి బయటకు లాగింది. ఆమెకు దొరికినవేంటో చూసి ఆ ఇంట్లో వారు భయపడిపోయారు. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి షాకవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..

ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. ఓ యువతి అలాగే ఇల్లు శుభ్రం చేస్తోంటే ఇంటి పైకప్పు నుండి వింత శబ్దాలు వచ్చాయి(Strange sounds from ceiling). ఆ శబ్దాలేంటోనని అందరూ అయోమయం చెందారు, కానీ ఓ యువతి మాత్రం ధైర్యం చేసింది. వీడియోలో ఓ యువతి బల్ల మీద నిలబడుకుని ఇంటి సీలింగ్ కు రంధ్రం చేసి ఆ రంధ్రంలోనికి మొదట ఓ పొడవాటి కర్రను లోపలికి జొప్పించడం చూడొచ్చు. ఆ తరువాత యువతి తన చెయ్యిని ఎలాంటి భయం లేకుండా ఆ రంధ్రంలోకి పెట్టి తన చేతికి దొరికిన దాన్ని బయటకు లాగుతుంది. ఆమె అలా లాగుతుంటే భారీ కొండచిలువ(giant python) బయటకు వస్తుంది. ఒక కొండచిలువ పూర్తీగా బయటకు వచ్చాక చివరలో ఇంకొక కొండచిలువ ఆ రంధ్రంలో నుండి బయటకు జారుతుంది. ఆ యువతి రెండవ కొండచిలువను కూడా చాలా చాకచక్యంగా పట్టుకుంటుంది. ఆమె ఏమాత్రం భయపడకుండా రెండు కొండచిలువలను పట్టుకుని బల్ల దిగి తీసుకెళుతుంది. అంతపెద్ద కొండచిలువలు పైకప్పులోకి ఎలా వెళ్లాయో ఎవరికీ అంతు చిక్కడంలేదు.

Viral Video: ఈ చిన్నారికి ఏమైంది? అమ్మవారిని చూస్తూ ఎందుకిలా ఏడుస్తోంది? దేవీనవరాత్రులలో విస్తుపోయే సంఘటన..



ఈ వీడియోను nathanslawnsandgardens అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో(Australia) జరిగినట్టు వీడియోలో మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'ఆ అమ్మాయేంటి అంత పెద్ద కొండచిలువలను పెంపుడు జంతువుల్లా అలా బయటకు తీసింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'అసలు అంత పెద్ద కొండచిలువలు సీలింగ్ లోకి ఎలా వెళ్లాయో అర్థం కావడంలేదు' అని ఇంకొకరు సందేహం వ్యక్తం చేశారు. 'ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాప్' అని మరొకరు స్పందించారు.

Viral Video: మార్కెట్ లోకి కొత్తరకం జీన్స్.. నెటిజన్ల శాపాలు మామూలుగా లేవుగా..


Updated Date - 2023-10-30T14:49:24+05:30 IST