Share News

Viral Video: లక్ష ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. 100 పచ్చిగుడ్లను ఒకేసారి తాగిన యూట్యూబర్‌.. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-11-18T13:34:12+05:30 IST

మనం డైలీ తీసుకునే ఆహారంలో కోడిగుడ్డును ఒక భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్స్‌తో పాటు మినరల్స్, శరీరానికి కావాల్సిన ఇతర పోషక పదార్థాలు మెండుగానే ఉంటాయి.

Viral Video: లక్ష ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. 100 పచ్చిగుడ్లను ఒకేసారి తాగిన యూట్యూబర్‌.. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి..!

Viral Video: మనం డైలీ తీసుకునే ఆహారంలో కోడిగుడ్డును ఒక భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్స్‌తో పాటు మినరల్స్, శరీరానికి కావాల్సిన ఇతర పోషక పదార్థాలు మెండుగానే ఉంటాయి. అందుకే పౌష్టికాహార లోపం అధిగమించాలి అనుకునేవారికి వైద్యులు సూచించే ఆహార పదార్థాలలో ముఖ్యమైనది కోడిగుడ్డు. ప్రతిరోజు కోడి గుడ్డు తినడం వల్ల పౌష్టికాహార లోపం అధిగమించవచ్చనేది వైద్యుల సలహా. దాంతో చాలా మంది తమ రోజువారీ డైట్‌లో కోడిగుడ్డును చేర్చుకోవడం కామన్. ఈ క్రమంలో కొందరు ఉడికించిన గుడ్డును తీసుకుంటే, మరికొందరు మాత్రం పచ్చిగుడ్లనే తాగేస్తుంటారు. ఇలా ఒకటిరెండు గుడ్లు తాగితే పర్లేదు కానీ, ఓ యూట్యూబర్ మాత్రం అమాంతం 100 పచ్చిగుడ్ల (Raw Eggs) ను ఒకేసారి తాగేశాడు. తన యూట్యూబ్ చానల్‌కు 1లక్ష ఫాలోవర్స్ అయ్యారనే ఆనందంలో అతడు ఇలా సాహసోపేత పనిచేసి, దాని తాలూకు వీడియోను సోషల్ మీడియా (Social Media) లో పెట్టడంతో వైరల్ అవుతోంది.

Viral News: బాబోయ్.. ఆ దేశంలో భార్య బర్త్‌డేను భర్త మర్చిపోవడం చట్ట విరుద్ధమట.. పైగా ఈ నేరానికి ఐదేళ్ల జైలుశిక్ష కూడా..!

ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన విన్స్‌ ఇయానోన్‌ (Vince Iannone) అనే యూట్యూబర్‌ తనకు 1లక్ష ఫాలోవర్స్‌ వచ్చినందుకు గానూ ఆనందంలో ఈ సాహసం చేశాడు. పైగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలోనే విన్స్‌ ఈ ఫీట్‌ను చేయడం గమనార్హం. తన ఫాలోవర్స్ కోసం ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేద్దామనుకున్న విన్స్ వెంటనే.. ఓ పెద్ద మగ్గు నిండా 100 పచ్చిగుడ్లను నింపుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో వివరిస్తూ.. మగ్‌లోని గుడ్డు మిశ్రమాన్ని తాగడం ప్రారంభించాడు. అలా సగం తాగేశాక కాస్త గ్యాప్‌ ఇచ్చి, మళ్లీ కాస్త తాగాడు. సగానికిపైగా అయిపోయిన తర్వాత మగ్‌ను పక్కకు పెట్టి నాలుగు పుషప్స్‌ చేశాడు. ఆ తర్వాత మళ్లీ తాగడం కొనసాగించాడు. అలా కొద్దిసేపట్లోనే ఆ మగ్‌లోని మొత్తం గుడ్డు మిశ్రమాన్ని ఖాళీ చేసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కోడిగుడ్డు శరీరానికి మంచిదే, కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ప్రమాదం తప్పదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శరీరానికి మేలు చేస్తుంది కదా అని గుడ్డును అతిగా తినేస్తే మాత్రం ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు.

Elections: ఈ ఎన్నికల్లో గెలుపెవరిది..? భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మరో పార్టీ నుంచి అదే సీట్లో పోటీ చేస్తున్న భార్య..!

Updated Date - 2023-11-18T13:37:31+05:30 IST