ICC Womens T20 World Cup 2023: పాకిస్థాన్‌తో కీలక పోరు.. టాస్ ఓడిన భారత్

ABN , First Publish Date - 2023-02-12T18:30:38+05:30 IST

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌(ICC Womens T20 World Cup 2023)లో భాగంగా

ICC Womens T20 World Cup 2023: పాకిస్థాన్‌తో కీలక పోరు.. టాస్ ఓడిన భారత్

కేప్‌టౌన్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌(ICC Womens T20 World Cup 2023)లో భాగంగా మరికాసేపట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ అమ్మాయిల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్(Pakistan) జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వేలి గాయంతో బాధపడుతున్న వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) స్థానంలో హర్లీన్ డియోల్(Harleen Deol) జట్టులోకి వచ్చింది. అలాగే, శిఖా పాండే జట్టుకు దూరమైంది.

గత ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్(Team India)తుది మెట్టుపై బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టుకురావాలని పట్టుదలగా ఉంది. ప్రత్యర్థితో పోలిస్తే అన్ని విభాగాల్లో హర్మన్‌(Harmanpreet Kaur) సేన పటిష్టంగా ఉంది. టోర్నీలో ఆసీస్‌ను ఎదుర్కోవాలంటే జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటాలి.

రేణుకా సింగ్‌‌ను మినహాయుస్తే పేస్‌ విభాగంలో ఇతర బౌలర్లు ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. తన కెప్టెన్సీలో భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌ కప్‌ అందించిన షెఫాలీ వర్మ(Shafali Verma) ఈ టోర్నీలో కీలకం కానుంది. పునరాగమనంలో సత్తామేరకు ఆడలేకపోతున్న జెమీమా రోడ్రిగ్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇక తొలి వరల్డ్‌ కప్‌ ఆడుతున్న తెలుగమ్మాయి అంజలీ శర్వాణి తుది జట్టులో చోటు లభించలేదు.

మరోవైపు పాకిస్థాన్ మాత్రం తమ ఆశలన్నీ నిదా దార్‌పైనే పెట్టుకుంది. టైటిల్‌ ఫేవరెట్‌ ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆడిన అనుభవంతో ఆ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది.

Updated Date - 2023-02-12T18:30:40+05:30 IST