IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సెంచరీ.. కోల్‌కతా భారీ స్కోరు

ABN , First Publish Date - 2023-04-16T17:43:58+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో రెండో సెంచరీ నమోదైంది. ముంబైతో ఇక్కడి వాంఖడే

IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సెంచరీ.. కోల్‌కతా భారీ స్కోరు

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో రెండో సెంచరీ నమోదైంది. ముంబైతో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాడు వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. బంతులను ఎడాపెడా స్టాండ్స్‌లోకి పంపిస్తూ పరుగుల వర్షం కురిపించాడు. అతడు బాదుతుంటే ముంబై బౌలర్లు ప్రేక్షకులై చూడడం తప్ప అడ్డుకట్ట వేయలేకపోయారు.

ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన వెంకటేశ్ అయ్యర్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో వెంకటేశ్‌కు ఇది తొలి సెంచరీ కాగా, ఐపీఎల్‌లో 77వది. 2008లో బ్రెండన్ మెకల్లమ్ కోల్‌కతా తరపున సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు వెంకటేశ్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు.

మొత్తంగా 51 బంతులు ఆడిన అయ్యర్ 104 పరుగులు చేసి మెరిడిత్ వేసిన పుల్‌టాస్‌కు దొరికిపోయి పెవిలియన్ చేరాడు. వెంకటేశ్ వీరబాదుడుతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్ 21, రింకు సింగ్ 18, శార్దూల్ ఠాకూర్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకెన్ 2 వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2023-04-16T17:43:58+05:30 IST