IPL 2023: కోల్‌కతాపై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ABN , First Publish Date - 2023-05-11T19:36:00+05:30 IST

ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో

IPL 2023: కోల్‌కతాపై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇప్పటి వరకు చెరో 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా, రాజస్థాన్ జట్టు పదేసి పాయింట్లతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అయితే, నెట్ రన్‌రేట్ పరంగా రాజస్థాన్ ఓ మెట్టు పైనుంది.

రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో బోల్ట్, మురుగన్ అశ్విన్ స్థానంలో కేఎం అసిఫ్ జట్టులోకి వచ్చారు. కోల్‌కతా మాత్రం ఒకే ఒక్క మార్పుతో ఆడుతోంది. వైభవ్ అరోరా స్థానంలో అనుకుల్ రాయ్ జట్టులోకి వచ్చాడు.

Updated Date - 2023-05-11T19:36:00+05:30 IST