India vs Australia 4th Test: గిల్ అర్ధ సెంచరీ పూర్తి..రోహిత్ శర్మ ఔట్..
ABN , First Publish Date - 2023-03-11T11:06:45+05:30 IST
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు(Fourth Test)ఆట ప్రారంభం
అహ్మదాబాద్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు(Fourth Test)ఆట ప్రారంభం అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 36/0తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను శుభమన్ గిల్(Shubman Gill), కెప్టెన్ రోహిత్(Captain Rohit) క్రీజులోకి వచ్చి మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా చేసిన భారీ స్కోర్ కు టీమిండియా(Team India) ఓపెనర్లు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరు కలిసి అర్ధశతక భాగస్వామ్యం (half-century partnership)నెలకొల్పారు. ఇదే క్రమంలో గిల్, రోహిత్ నిలకడగా ఆడుతున్న స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. అనూహ్యంగా ఈ జోడీని ఆసీస్ బౌలర్ కునెమన్ విడదీశాడు. కునెమన్(Kuneman) బౌలింగ్‌లో రోహిత్ శర్మ(35) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లబుషేన్‌కి(Labushene) క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ను 74 పరుగుల వద్ద కొల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన మరో బ్యాటర్ శుభమన్‌గిల్ 93 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 51 రన్స్ చేసి.. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (51), పుజారా (13) కొనసాగుతున్నారు. భారత్ స్కోర్ 30 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 101 రన్స్ చేసింది.