India vs Australia: మూడున్నరేళ్ల తర్వాత టెస్టుల్లో కోహ్లీ సెంచరీ..
ABN , First Publish Date - 2023-03-12T12:58:23+05:30 IST
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాIndia vs Australia మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) నాల్గవ టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ...
అహ్మదాబాద్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) నాల్గవ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేశాడు. 241 బంతుల్లో 5 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. దీంతో మూడున్నరేళ్ల నిరీక్షణ తెరపడింది. అంటే ఏకంగా 1205 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేసినట్టయ్యింది. దీంతో టెస్ట్ క్రికెట్ కెరీర్లో 28 శతకాన్ని నమోదు చేశాడు. చివరి సారిగా 2019 నవంబర్ 22న కోహ్లీ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ 140 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్ (5), కోహ్లీ (100) రన్స్ చేసి కొనసాగుతున్నారు.
అంతకుముందు కేఎస్ భరత్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కామెరూన్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి .. ఒకే ఓవర్ లో ఏకంగా 21 పరుగులు రాబట్టాడు. ఇదే క్రమంలో లయన్ వేసిన 136.4 ఓవర్లో భరత్ 44 పరుగుల వద్ద హ్యాండ్స్ కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఇంకా టీమిండియా 69 పరుగులు వెనుకబడి ఉంది.